Begin typing your search above and press return to search.
ఈసారికి హుస్సేన్ సాగర్‌లోనూ నిమజ్జనం
By: Tupaki Desk | 3 Sep 2015 12:38 PM GMTవినాయకచవితి సందర్భంగా హైదరాబాదీయులు తమ విగ్రహాల్ని హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేసేందుకు ఎక్కువ ఆసక్తి ప్రదర్శిస్తుంటారు. అయితే.. కాలుష్యం.. పర్యావరణ అంశాల కారణంగా హుస్సేన్ సాగర్ లో కాకుండా మరోచోట నిమజ్జనం చేసేలా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం భావించటం తెలిసిందే. ఇందిరా పార్కులో వినాయక సాగర్ పేరిట ఒక ఏర్పాటు చేసి అక్కడ నిమజ్జనం చేయించాలని భావించింది.
అయితే.. ఇప్పటివరకూ అలాంటి ప్రయత్నం ఏమీ వాస్తవరూపం దాల్చకపోవటం.. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనానికి అవకాశం ఉండదన్న వార్తల నేపథ్యంలో.. నిమజ్జనం కారణంగా కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయాలంటూ మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు.
ఈ అంశంపై విచారించిన హైకోర్టు గురువారం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాదికి హుస్సేన్‌సాగర్ లోనే వినాయక నిమజ్జనం చేయొచ్చని పేర్కొంది. కాకుంటే.. నిమజ్జనం జరిగిన వెంటనే.. ఆ వ్యర్థాల్ని తొలగించే ఏర్పాట్లు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర సర్కారుకు సూచనలు చేసింది. వచ్చే ఏడాదికి హుస్సేన్ సాగర్‌కు ప్రత్యామ్నాయంగా నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ఈ నేపథ్యంలో.. ఈ ఏడాదికి వినాయక నిమజ్జనం హుస్సేన్ సాగర్ లోనే జరుగుతుందన్నది స్పష్టమైందని చెప్పొచ్చు.