Begin typing your search above and press return to search.
లడ్డూ కావాలా నాయనా..అంటూ వలపుల వల!
By: Tupaki Desk | 1 Aug 2018 7:41 AM GMTఆ మధ్య బాగా పాపులర్ అయిన యాడ్ గుర్తుందిగా.. లడ్డూ కావాలా? అంటూ.. ఇంచుమించే అదే కాన్సెప్ట్. అందమైన అమ్మాయి. చూడగానే మనసు పారేసుకునేలా ఉండటమే కాదు.. ఇంత మొత్తం చెల్లిస్తే.. ఈ అందమంతా గంటల చొప్పున కొరుక్కు తినేయొచ్చంటూ ఊరించే మాటలు.. హైదరాబాద్ కు చెందిన వందల మంది అబ్బాయిల మనసుల్ని మాయ చేసేస్తోంది ఒక కిలేడీ.
అక్కడితో ఆగట్లేదు.. ఈ కిలేడీ పుణ్యమా అని తమ దారిన తాము బతుకుతున్న ఒక అపార్ట్ మెంట్ వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కిలేడీ ఏమిటి?.. లడ్డూ ఏమిటి? అపార్ట్ మెంట్ వాసులేంటి? అన్న కన్ఫ్యూజింగ్ గా ఉందా? మరింత క్లారిటీగా చెప్పేస్తాం.
హైదరాబాద్ లోని బేగంపేట ఎంత ఫేమస్సో తెలిసిందే కదా. కొన్ని వెబ్ సైట్లలో రాత్రికి వలపు రెఢీ అంటూ కొన్ని లింకులు.. ఫోన్ నెంబర్లు రావటం తెలిసిందే. అదే విధానాన్ని ఫాలో అయ్యింది ఒక కిలేడీ. ఆ నెంబరుకు ఫోన్ చేసినంతనే.. వాట్సాప్ చాట్ కు రమ్మని కోరటం.. నాలుగు మాటలతో కిక్ ఎక్కించటం.. ఆ వెంటనే వలపులోకి దింపి.. గంటకు కావాలా? రాత్రి మొత్తం కావాలా? అని అడగటం.. రేటు ఫిక్స్ చేయటం జరిగిపోతుంది.
ఇక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. ఒప్పందం చేసుకున్న మొత్తాన్ని ఫలానా అకౌంట్లో జమ చేయాలన్న మాట చెబుతుంది. సర్లే.. అని ఆ మొత్తాన్ని ఆమె చెప్పినట్లే అకౌంట్లో వేసినంతనే.. పొద్దున వద్దు.. రాత్రికి రెఢీ అని ఊరించే మాటతో పాటు.. గూగుల్ పిన్ పెట్టిన అడ్రస్ లింక్ పంపుతుంది. టెక్ట్స్ కూడా పంపుతుంది.
అంతేనా.. ఇంటికి వచ్చే ముందు.. జేబులో డబ్బులు పెట్టుకు రావొద్దు.. పోలీసుల వద్ద తలనొప్పులు వస్తాయన్న చిన్నపాటి హెచ్చరిక చేస్తుంది. రాత్రి వేళ అడ్రస్ కు వచ్చేసరికి తలుపు తీసి ఉంటుందని.. నేరుగా లోపలకు వచ్చేయటమేనని ఊరిస్తుంది. ఇంత నమ్మకంగా.. ఇంత పక్కాగా ఉంటే అనుమానం ఎవరికి వస్తుంది?
వలపు ఊహలతో చెప్పిన అడ్రస్ కు వెళ్లి.. తలుపు తోస్తే.. లాక్ చేసి ఉంటుంది. అసహనంతో బెల్ కొడితే.. ఊహించని రీతిలో ఇంట్లో పెద్ద వాళ్లు బయటకు వచ్చి.. ఈ రాత్రి వేళ.. మీరెవరు? అన్న క్వశ్చన్ మార్క్. దాంతో.. తాను మోసపోయానని అర్థం చేసుకొని నీళ్లు మింగుకుంటూ తిరిగి వచ్చే వారు కొందరైతే.. గట్టిగా నిలదీసే వారు మరికొందరు.
ఈ కిలేడీ ఎప్పుడూ ఒకే అపార్ట్ మెంట్ అడ్రస్ ఇవ్వటం.. ఇప్పుడా అపార్ట్ మెంట్ వాసులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఏ వేళలో.. ఎవరొచ్చి ఇంటి తలుపు తడతారో అర్థం కాని పరిస్థితి. వచ్చిన ప్రతి ఒక్కడూ డబ్బులు ఇచ్చామంటూ దబాయిస్తున్న వైనంతో ఆ అపార్ట్ మెంటు వాసులకు నిద్ర పట్టటం లేదు.
కొందరు మగాళ్లు అయితే.. ఆఫీసులకు సెలవు పెట్టి మరీ.. సమాధానాలు ఇవ్వాల్సిన దుస్థితి. ఈ ఇబ్బంది మరింత పెరిగిపోవటంతో బేగంపేట పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పెట్రోలింగ్ వాహనం పెట్టి ఇప్పటికి పలువురి మీద కేసులు బుక్ చేసినా.. లడ్డూ కోసం వచ్చే వరద మాత్రం ఆగటం లేదట. దీంతో..ఆ అపార్ట్ మెంటు వాసులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున మోసం చేస్తున్న ఈ లడ్డూ చిన్నదాని ఫోన్ నెంబర్ ను ట్రేస్ చేసే పనిలో పడిన పోలీసులకు సైతం చుక్కలు కనిపిస్తున్నాయట. ఎందుకంటే..ఒకసారి ముంబయి లొకేషన్లో కనిపిస్తే.. మరోసారి బెంగళూరు.. ఇలా రకరకాల ప్లేసుల్లో ఉన్నట్లుగా కనిపిస్తున్న ఈ మాయలేడీని ఎలా అదుపులోకి తీసుకోవాలో పోలీసులకు ఒక పట్టాన అర్థం కావట్లేదట. ఈ లడ్డూ పాప తొందరగా దొరికిపోతే కానీ తమ కష్టాలు తీరవని సదరు అపార్ట్ మెంట్ వాసులు వాపోతున్నారు.