Begin typing your search above and press return to search.
అమెరికాలో హైదరాబాద్ మహిళ ఆత్మహత్య
By: Tupaki Desk | 7 Oct 2019 8:35 AM GMTహైదరాబాద్ కు చెందిన వివాహిత అమెరికాలో ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్ లోని నాగోల్ సాయినగర్ కు చెందిన వనితకు 2006లో శివకుమార్ తో వివాహమైంది. కొద్దిరోజులు నగరంలో జీవించిన వీరి జంట ఆ తర్వాత అమెరికాకు వెళ్లిపోయారు. వీరికి ఒక పాప, బాబు జన్మించారు.
అయితే సజావుగా సాగిన వీరి కాపురంలో కలతలు మొదలయ్యాయి. శివకుమార్ తన భార్యను మానసికంగా వేధింపులకు గురిచేసేవాడు. దీంతో ఆమె పిల్లలను తీసుకొని నగరానికి వచ్చి తల్లిదండ్రుల వద్ద ఉంటోంది.
ఏడాది తర్వాత మారిపోయిన శివకుమార్ హైదరాబాద్ కు వచ్చి భార్య, అత్తామామలకు సర్ధిచెప్పి గత ఏడాది జులైలో తిరిగి భార్యను అమెరికా తీసుకెళ్లాడు.
ప్రస్తుతం వీరు అమెరికాలోని నార్త్ కరోలినాలో ఉంటున్నారు. అయితే మళ్లీ గొడవలు మొదలు కావడంతో మనస్తాపం చెందిన వనిత ఆత్మహత్యకు పాల్పడింది. వనిత ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రాసిన సూసైడ్ నోట్ లభ్యమైంది. వనిత సూసైడ్ చేసుకోవడంతో ఆమె తల్లిదండ్రులకు అమెరికా పోలీసులు ఫోన్ చేసి విషయం చెప్పారు. శివకుమార్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. తమ కుమార్తె మృతికి ఆమె భర్తే కారణమని వారు ఆరోపిస్తున్నారు.