Begin typing your search above and press return to search.
ఓర్నీ.. జట్టు రాలిపోతుందని సూసైడ్
By: Tupaki Desk | 7 Jan 2020 6:20 AM GMTచదువు లేనోళ్లు.. అక్షం తెలీనోళ్లు.. చుట్టు ఉన్న ప్రపంచం మీద అవగాహన లేనోళ్లు.. మూఢనమ్మకంతోనో.. ఇంకో కారణంతోనే ఆత్మహత్యలు చేసుకుంటే అర్థం చేసుకోవచ్చు. చాలా చిన్న చిన్న కారణాలతో చచ్చిపోతున్నోళ్ల ఉదంతాలు విన్నంతనే ఉలిక్కి పడటమే కాదు.. ఇదెక్కడి గోలరా బాబు? అనుకోకుండా ఉండలేం. తాజాగా హైదరాబాద్ లోని కొండాపూర్ ప్రాంతానికి చెందిన ఇంటర్ కుర్రాడు సూసైడ్ కారణం తెలిస్తే అవాక్కు కావటమే కాదు.. ఇదెక్కడి వెర్రితనంరా బాబు? అనుకోకుండా ఉండలేం.
మాదాపూర్ లోని ఒక కంపెనీలో ఉన్నత స్థానంలో ఉన్న ఒక వ్యక్తికి భార్య.. ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు ఏంబీఏ చదువుతుంటే.. చిన్నకొడుకు (18) జేఈఈ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. ఇంటి దగ్గరే పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అతడు.. సైనస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు.
ఆర్నెల్లుగా అతడి జుట్టు ఊడిపోవటం మొదలై.. అది అంతకంతకూ ఎక్కువ అవుతోంది. చిన్నవయసులోనే బట్టతల వస్తోందని వేదన చెందుతూ.. తల్లిదండ్రులకు చెబుతున్నాడు. అయితే.. అతనికి వారు సర్దిచెప్పేవారు. తాజాగా స్నానానికి బాత్రూంలోకి వెళ్లిన అతడు.. ఎంతసేపటికి రాకపోవటంతో.. బాత్రూం తలుపు బద్ధలు కొట్టారు. అక్కడ ఊరి వేసుకొని ఉండటం చూసి అవాక్కు అయ్యారు. బట్టతల సమస్యతో మనో వేదనకు గురై.. ఆత్మహత్య చేసుకున్న ఉదంతం ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఈ లెక్కన.. ఇదే సమస్య అయితే ప్రపంచంలో ఎంతమంది చచ్చిపోవాలి? చిన్న సమస్యను పెద్ద సమస్యగా ఫీల్ అవుతూ వేదన చెందే వారి విషయంలో తల్లిదండ్రులు మరింత అప్రమత్తతో ఉండాలన్న విషయం తాజా ఉదంతం ఒక హెచ్చరిక లాంటిది.