Begin typing your search above and press return to search.

హైదరాబాదీ స్టైలిష్ క్రికెటర్ బీజేపీ లోకి చేరబోతున్నారా?

By:  Tupaki Desk   |   28 Oct 2021 4:58 AM GMT
హైదరాబాదీ స్టైలిష్ క్రికెటర్ బీజేపీ లోకి చేరబోతున్నారా?
X
వివాదాల కు దూరం గా ఉండటం హైదరాబాద్ కు చెందిన వీవీఎస్ లక్ష్మణ్ కు అలవాటు. తెలుగు వాడు కాకుండా ఉంటే.. అతగాడికి టీమిండియా లో మరో స్థాయి కి చేరుకునే వారన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. అతగాడి కెరీర్ లో మరే క్రికెటర్ ఎదుర్కొనన్ని పరీక్షల్ని ఆయన ఎదుర్కొన్నారని చెబుతారు. అయిన ప్పటికి గుండెల్లో బాధ ను బయటకు పెట్ట కుండా జెంటిల్ మెన్ గా ఉండే వీవీఎస్ లక్ష్మణ్.. ఎవరూ ఊహించని విషయంలో వార్తల్లో కి వచ్చారు.

జోరు గా ప్రచారం సాగుతున్న ఈ అంశం పై అధికారికం గా ఎలాంటి ప్రకటన విడుదల కానప్పటి కీ.. వీవీఎస్ లక్ష్మణ్ బీజేపీ లోకి చేరతారన్న ప్రచారం జోరందుకుంది. ఆయన చేరిక కు పార్టీ కీలక నేత కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఓకే చెప్పారని చెబుతున్నారు. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ కు వ్యాఖ్యాత గా వ్యవహరిస్తున్న ఆయన దుబాయ్ లో ఉన్నారు. 2012లో అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన లక్ష్మణ్ కు స్టైలీష్ బ్యాట్ మెన్ గా మంచి పేరున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మెంటార్ గా ఉన్నారు.

హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీ లో నివాసం ఉండే లక్ష్మణ్.. వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్ లోని ఒక అసెంబ్లీ నియోజక వర్గం నుంచి బీజేపీ అభ్యర్థి గా పోటీ చేయటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ముభావం గా ఉండటం.. అందరి తో కలుపుగోలు గా ఉండని లక్ష్మణ్ లాంటి వ్యక్తి కి రాజకీయాలు సూట్ అవుతాయా? ఎన్నిక ల్లో పోటీ చేసే మైండ్ సెట్ ఆయనకు ఉందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఆయన పొలిటికల్ ఎంట్రీ మీద వస్తున్న వార్తల పై క్లారిటీ ఆయన ఇచ్చిన తర్వాతే నమ్మగలమని.. అంత వరకు దీన్ని నిజమని భావించలేమన్న మాట కొందరి నోటి నుంచి వినిపిస్తోంది. మరి.. తన పొలిటికల్ కెరీర్ గురించి ఆయనేం చెబుతా రో చూడాలి.