Begin typing your search above and press return to search.

హైదరాబాద్ వాసుల గుండె ఖరాబౌతోంది

By:  Tupaki Desk   |   19 Nov 2019 6:31 AM GMT
హైదరాబాద్ వాసుల గుండె ఖరాబౌతోంది
X
ప్రస్తుత జీవన విధానంలో డబ్బు సంపాదనకు ఇస్తున్న ఇంపార్టెన్స్..మానవ సంబంధాలకు , ఆరోగ్యానికి కూడా ఇవ్వడంలేదు. డబ్బేరా అన్నింటికీ మూలం అన్నట్టు .. డబ్బు కోసమే ప్రతి క్షణం పరితపిస్తున్నారు. ఈ డబ్బు సంపాదనలో పడి ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోవడంలేదు. దీనితో చాలా మంది తక్కువ వయస్సులోనే ..పెద్ద పెద్ద జబ్బుల భారిన పడుతున్నారు. ఇకపోతే తాజాగా సర్వే ప్రకారం హైదరాబాద్ లో లివర్ వ్యాధి బాధితులు కొద్ది కొద్దిగా పెరిగిపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో హెపటైటిస్‌‌
వైరస్ విస్తరిస్తోంది. దీంతో ఈ వ్యాధి బాధితులను లెక్కించాలని హెల్త్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ నిర్ణయించింది. ఈ మేరకు హెపటైటిస్‌‌ పేషెంట్స్ ఎక్కువగా నమోదవుతున్న గద్వాల జిల్లాలో స్క్రీనింగ్ పైలెట్ ప్రాజెక్ట్‌‌ చేపడుతోంది.

ముందుగా ఆ జిల్లాలో రెండు ధపాలుగా వ్యాక్సిన్ ఇచ్చి , ఆ తరువాత స్క్రీనింగ్ చేయనున్నారు. ఈ అవసరమైన మెడికల్ కిట్లను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర అధికారులకు అందజేసింది. ఈ స్క్రీనింగ్ లో జబ్బు ఉన్నట్టు తేలిన వాళ్లకు నేషనల్ హెల్త్ మిషన్ ఫండ్స్‌‌తో ఫ్రీగా ట్రీట్‌‌మెంట్ ఇస్తారు. అలాగే ఈ జబ్బుకి ఒక ఏడాదికి సుమారుగా రూ.5 లక్షల వరకూ ఖర్చవుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇటీవల రాష్ట్రంలో ‘హెపటైటిస్‌‌ సీ’ కేసులు ఎక్కువ నమోదవుతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ఇక ‘బీ’ వైరస్ కేసులూ ఎక్కువగానే ఉన్నాయి. దేశంలో సుమారు 4.5 కోట్ల మంది హెపటైటిస్‌‌ బీ వైరస్‌‌తో బాధపడుతున్నట్టు అంచనా వేశారు.

ఈ వైరస్‌‌ చాలా ప్రమాదకరం. కలుషిత రక్తం, సిరంజ్‌‌లు, సూదులు వాడటం, రక్షణ లేని లైంగిక చర్యల వల్ల ఇది సంక్రమిస్తుంది. వ్యాధి లక్షణాలు పైకి కన్పించకపోవడంతో 50 నుంచి 60% కేసుల్లో లివర్‌‌ దెబ్బ తిన్నాకే పేషెంట్లు తమ వద్దకు వస్తున్నారని డాక్టర్లు చెబుతున్నారు. రాష్ట్ర జనాభాలో 2 నుంచి 3% మంది కాలేయ జబ్బులతో బాధపడుతున్నట్టు అంచనా. ఇక దేశంలో 5.2 కోట్ల మంది హెపటైటిస్‌‌‌‌‌‌‌‌ రోగులున్నట్టు సెంట్రల్ హెల్త్‌‌ మినిస్ట్రీ లెక్కలు చెబుతున్నాయి. ఎక్కువగా అరక్షిత సెక్స్‌‌, షుగర్‌‌ పేషెంట్లు, మితిమీరిన ఆల్కహాల్‌‌ తీసుకోవడం, కలుషిత నీరు, ఆహారంతో కాలేయ వ్యాధి బాధితులుగా మారుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ బాధితుల సంఖ్య ఇంకా ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది అని తెలిపారు. దీనితో ఈ వ్యాధిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.