Begin typing your search above and press return to search.
హైదరాబాదీలు డేరింగే కాదు... డేటింగ్ లోనూ
By: Tupaki Desk | 9 Dec 2021 5:02 PM ISTహైదరాబాద్ అంటే ఘుమఘుమలాడే బిర్యానీ.. హైదరాబాద్ అంటే నవాబుల నిర్మాణాలు.. హైదరాబాద్ అంటే ఐటీ టవర్లు.. హైదరాబాద్ అంటే ఫార్మా సిటీ.. హైదరాబాద్ అంటే అవకాశాల గని.. అన్నీఉన్న రాజధాని..
ఇప్పుడు హైదరాబాదీలు వీడియో డేటింగ్ లో టాప్ లో ఉన్నారు. ఔను మరి.. ఆన్లైన్ డేటింగ్ ప్లాట్‌ఫామ్ టిండర్ నిర్వహించిన ఇయర్ ఇన్ స్వైప్–2021 సర్వేలో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉంది. చిత్రమేమంటే.. హైదరాబాద్ కంటే సాఫ్ట్ వేర్ లో ముందున్న చెన్నై, బెంగళూరు, పుణే నగరాలు తర్వాతి ప్లేసుల్లో నిలిచాయి . నంబరు2లో చెన్నై, 3వ స్థానంలో బెంగళూరు, 4లో అహ్మదాబాద్, 5 వ స్థానంలో పుణే నగరాలు ఉన్నాయి
ఫోన్‌లోనే అన్నీ
హైదరాబాద్ లో న్యూడ్ వీడియో కాల్ సంస్కృతి బాగా పెరిగింది. ప్రధానంగా టీనేజర్లు నగ్నంగా వీడియోల్లో మాట్లాడుకోడానికి, సెక్స్ చాట్ చేసుకోడానికి ఏమాత్రం భయపడట్లేదు. ఒకరికొకరు నచ్చి డేటింగ్ చేసుకుంటే వేరే సగతికానీ, ఇక్కడ సమస్య భద్రతది.
హద్దులు దాటే పిల్లలు ఆ తర్వాత వీడియోల వల్ల తలెత్తే ప్రమాదకర పరిణామాలను అంచనా వేయలేకపోతున్నారు..’అంటూ ప్రఖ్యాత పోలీస్ అధికారిణి ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు తెలుగునాట వైరలైన సంగతి తెలిసిందే. యువతను హెచ్చరించడానికి ఆమె అలా చెప్పారుగానీ, వాస్తవంలో మాత్రం వీడియో డేటింగ్స్ వేగంగా పెరుగుతున్నాయి.
ఎంతగా అటే.. ఇండియాలోనే హైదరాబాద్ టాప్ ప్లేసులో నిలిచేంత... సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఇప్పుడు డేటింగ్ అనేది ఇప్పుడు ఒక ఫ్యాషన్‌గా మారింది. ఇలాంటి యాప్‌లను అత్యధికంగా వాడుతున్న భారతీయ నగరాల్లో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. ప్రముఖ ఆన్లైన్ డేటింగ్ ప్లాట్‌ఫామ్, సోషల్ నెట్వర్కింగ్ యాప్ టిండర్ నిర్వహించిన ఇయర్ ఇన్ స్వైప్–2021 సర్వేలో ఈ ఆసక్తికర విషయం వెల్లడైంది.
టిండర్ సహా ఇతర డేటింగ్ యాప్‌లోని రకరకాల అంశాలపై యూజర్లను ప్రశ్నలడిగారు. ఇందులో ప్రధానంగా పిక్నిక్ ఇన్ ఎ పార్క్, వర్చువల్ మూవీ నైట్, సైక్లింగ్, పొట్టెరీ, గెట్టింగ్ కాఫీ, వార్మ్ హగ్ వంటివి ఉన్నాయి. మరి కొద్ది రోజుల్లో 2021 ఏడాది ముగియనున్నందున.. ఈ ఏడాదిలో వీడియా డేటింగ్‌పై అంచనాకు వచ్చేందుకు ఈ సర్వేను చేపట్టింది. టిండర్. ఈ సర్వేలో 18 నుంచి 25 సంవత్సరాల వయస్సు కలిగిన వారి నుంచి సమాచారం సేకరించింది.
కరోనాతో యాప్‌లకు డిమాండ్ అమాంతం పెరిగింది. ప్రజలు డైరెక్ట్‌గా కన్నా వర్చువల్‌గానే ఇతరులతో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం, విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు చాలా దగ్గరయ్యాయి. వీటితో పాటు ఫుడ్, న్యూస్, ఎంటర్టైన్మెంట్ ఇలా ఏది కావాలన్నా ఆన్లైన్లోనే వెతుక్కుంటున్నారు.
ఆన్ లైన్ వాడకం పెరిగిన కొద్దీ మనిషి జీవితమే వర్చువల్‌గా మారిపోయిందనడంలో అతిశయోక్తి లేదు. ఇదే సమయంలో వీడియో డేటింగ్ యాప్స్‌కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. గతంలో పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా ఉండే ఈ సంస్కృతి ఈ మధ్య భారత్‌లో గణనీయంగా పెరిగింది.
వీడియో కాలింగ్‌లో టిండర్ యాప్ 52 శాతం వృద్ధిని సాధించింది. ఇన్ యాప్ వీడియోకాల్ ఫీచర్‌ను ప్రవేశ పెట్టడం ద్వారా ఎక్కువ మంది దీన్ని డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ యాప్ అతి కొద్ది రోజుల్లోనే గణనీయమైన డౌన్లోడ్స్ సాధించినట్లు సర్వే పేర్కొంది.
మరోవైపు ఎమోజీల ద్వారా భావోద్వేగాలు పంచుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపారు. సర్వేకు బయట, వెలుగుచూస్తోన్న ఆన్ లైన్ నేరాలు, న్యూడ్ వీడియో కాల్స్ సంస్కృతిపై సిటీలోని పలు పోలీస్ స్టేషన్లలో దాదాపు ప్రతిరోజూ ఎక్కడో ఓచోట ఫిర్యాదులు వెళుతూనే ఉన్నాయి.