Begin typing your search above and press return to search.
ఊరికి మళ్లీ వెళ్లిపోతున్న హైదరాబాదీయులు
By: Tupaki Desk | 1 July 2020 4:30 AM GMTరోజుకు దగ్గర దగ్గరగా తొమ్మిది వందల మంది వరకూ పాజిటివ్ కేసులు హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకుంటున్నాయి. గతానికి భిన్నంగా జూన్ నెలలో పెరిగిన కేసులు హైదరాబాద్ వాసుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో.. ఎక్కడకు వెళ్లాలన్నా భయాందోళనలకు గురి అవుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. పాజిటివ్ గా తేలితే.. ప్రభుత్వ ఆసుపత్రులు ఇంట్లోనే ఉండి చికిత్స చేసుకోవాలని కోరుతుంటే.. ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్లు ఖాళీ లేవని చెబుతూ.. డిమాండ్ ఎంత ఉందన్న విషయాన్ని చెప్పేస్తున్నాయి.
ఇలాంటివేళ.. రిస్కులో ఉండే కన్నా.. ఊరికి వెళ్లిపోతే మంచిదన్న ఆలోచనలో పలువురు హైదరాబాదీయులు ఉన్నారు. ఇప్పటికే పలు దశల్లో హైదరాబాద్ నగర ప్రజలు ఊళ్లకు వెళ్లిపోగా.. గడిచిన నాలుగైదురోజులుగా మరింతగా ఊపందుకుంది. ఓవైపు కేసులు పెరిగిపోవటం.. మరోవైపు లాక్ డౌన్ మళ్లీ విధిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతుండటంతో ఊరి మీద ఆలోచనలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
హైదరాబాద్ తో పోలిస్తే.. ఊళ్లు చాలా సేఫ్ అన్న మాట పలువురి నోట బలంగా వినిపిస్తోంది. ఊళ్లలో పాజిటివ్ కేసులు తక్కువగా ఉండటంతో పాటు.. ఇంట్లోని కుటుంబ సభ్యులతో ఉండొచ్చన్న ఆలోచన అంతకంతకూ పెరుగుతోంది. కనుచూపు మేర పరిష్కారం కనిపించని వేళలో హైదరాబాద్ లో ఉండి బిక్కుబిక్కుమనే కన్నా.. ఊరికి వెళితే.. అంతా ఒకే చోట ఉన్నట్లు ఉంటుందన్న భావన కూడా పలువురిలో పెరుగుతోంది. దీంతో.. ఊరి బాట పడుతున్నారు ఎక్కువ మంది.
మరి కొద్ది రోజుల్లో లాక్ డౌన్ విధించే అవకాశం ఉండటం.. ఈసారి లాక్ డౌన్ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. దీంతో.. ప్రజారవాణా సౌకర్యం అంతంతమాత్రంగా ఉన్నా.. ఎవరికి వారు తమకు తగ్గట్లు గా ఏదో వాహనం లో ఊరెళ్లి పోతున్నారు. ఈ ప్రభావం పలు టోల్ ప్లాజాల పై పడింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ గేట్ వద్ద వాహనాలు పెద్ద ఎత్తున నిలిచి పోయాయి. ఫాస్టాగ్ వాహనాలు ఆగకుండా వెళ్లిపోతే.. నాన్ ఫాస్టాగ్ వాహనాలు కిలోమీటరు మేర నిలిచిపోయాయి. పెద్ద ఎత్తున వాహనాలు రావటమే దీనికి కారణంగా చెబుతున్నారు. ఈ జాంతో వాహనదారులు గంటల పాలు ఇబ్బందికి గురైనట్లుగా చెబుతున్నారు.