Begin typing your search above and press return to search.

కస్టమర్ ట్వీట్ పై జొమాటోలో హైడ్రామా..!

By:  Tupaki Desk   |   1 Nov 2022 1:30 PM GMT
కస్టమర్ ట్వీట్ పై జొమాటోలో హైడ్రామా..!
X
ఒక వ్యాపారం సక్సస్ సాధించిన.. లేదా ఫెయిల్యూర్ అయినా దానికి ప్రధాన కారణం ఆ కంపెనీ నిర్వాహకులు.. ఉద్యోగులే అవుతారు. బాస్ తో సహా ఉద్యోగులంతా కస్టమర్లను దేవుడిగా భావించి సేవలందిస్తేనే ఆ కంపెనీ త్వరితంగా అభివృద్ధి పథంలోకి వస్తుంది. లేదంటే ఎంత స్పీడుగా కంపెనీ ప్రారంభించారో అంతే స్పీడుగా తట్టాబుట్టా సర్దుకోవాల్సిందేనని బిజినెస్ అనలిసిస్టులు చెబుతుంటారు.

ప్రపంచవ్యాప్తంగా ఆన్ లైన్ వ్యాపారం జరుగుతున్న నేపథ్యంలో మల్టినేషనల్ కంపెనీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ క్రమంలోనే కస్టమర్ల నుంచి సదరు కంపెనీ రివ్యూలు.. ఫీడ్ బ్యాక్ సర్వేలను తీసుకుంటున్నాయి. కస్టమర్లు ఇచ్చే సలహాలు, సూచనలతో సదరు కంపెనీ తమ ప్రొడక్టును మరింత మెరుగు పరుచుకుంటున్నాయి. తద్వారా కస్టమర్లను మరింత చేరువ అవుతున్నాయి.

అయితే ఇందుకు భిన్నంగా జొమాటో కంపెనీ ఉద్యోగులు వ్యవహరించారు. ఓ కస్టమర్ తనకు ఓ రెస్టారెంట్లో ఎదురైన చేదు సంఘటనతో జొమాటో కంపెనీకి వ్యతిరేకంగా యాప్ లో రివ్యూ ఇచ్చాడు. అయితే ఈ రివ్యూ తమ కంపెనీ పాలసీకి విరుద్ధంగా ఉందంటూ కస్టమర్ రివ్యూను జొమోటో డిలీట్ చేసింది. ఆ తర్వాత ఇందుకు గల కారణాలను వివరిస్తూ సదరు కస్టమర్ కు మెయిల్ కూడా చేసింది

ఈ వ్యవహారంపై అసహనంగా ఉన్న సదరు కస్టమర్ జొమాటో నుంచి వచ్చిన మొయిన్ స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఇందులో రెస్టారెంట్ల మంచి చెడు చెత్త ఇలా ఎలా అభిప్రాయం ఉన్న తీసుకుంటామని.. ఇలాంటి రివ్యూలు ఇతర యూజర్లకు ఉపయోగంగా ఉంటాయని పేర్కొంది.

అయితే తమకు కంటెంట్ పరంగా కొన్ని పరిమితులు ఉంటాయని.. హెల్త్ కోడ్ కు సంబంధించిన ఉల్లంఘనకు ఇది సరైన వేదిక కాదని స్పష్టం చేసింది. రెస్టారెంట్ లో మీరు ఫుడ్ తిన్న తర్వాత అనారోగ్యానికి గురవడం బాధాకరమని పేర్కొంది. ఈ విషయాన్ని మీరు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళితే మంచిదని పేర్కొంటూ రివ్యూను తొలగించింది.

ఈ ట్వీట్ ను చూసిన నెటిజన్లు జొమాటోపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘‘ఒక రెస్టారెంట్లో ఎదురైన అనుభవాలను జొమాటో వేదికగా చెప్పేందుకు అనుమతి లేకపోతే.. ఇంకా ఏం కామెంట్లు చేయాలి?.. మీ రూల్స్ చాలా తప్పు’’ అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు.

అతి జాగ్రత్తలో భాగంగా మా కంటెంట్ గైడ్ లైన్స్ నుంచి ఆ పాలసీని రూపొందించామని తెలిపారు. అయితే ఇప్పుడు ఆ పాలసీని తొలగించామని చెప్పారు. దీంతో మీ రివ్యూ తిరిగి పునరుద్ధరించడం జరిగిందని జొమాటో సీఈవో తెలిపారు. రెస్టారెంట్లో మీకు ఎదురైన అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వ్యవహారంలో జొమాటో సీఈవో చాకచక్యంగా వ్యవహరించారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.