Begin typing your search above and press return to search.

వెంక‌య్య అస‌లు సిస‌లు మాంసాహారేన‌ట‌!

By:  Tupaki Desk   |   17 Jun 2017 8:01 AM GMT
వెంక‌య్య అస‌లు సిస‌లు మాంసాహారేన‌ట‌!
X
గోవ‌ధ నిషేధంపై ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది. గోవ‌ధను పూర్తిగా నిషేధించాల‌ని కొంద‌రు వాదిస్తుంటే... ఒక‌రి భోజ‌న అల‌వాట్ల‌ను ఇత‌రులు ఎలా నిర్ణ‌యిస్తారంటూ ఎదురు ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. తొలి వ‌ర్గానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అనుకూలురు వ‌త్తాసు ప‌లుకుతుండ‌గా, రెండో వ‌ర్గానికి ఆ పార్టీ విరోధులు మద్ద‌తు ప‌లుకుతున్నారు. త‌మ ఆహార‌పుట‌ల‌వాట్ల‌పై మీ పెత్త‌నం ఏమిటంటూ వామ‌ప‌క్ష భావ‌జాల‌మున్న విద్యార్థి సంఘాలు ఏకంగా వ‌ర్సిటీల్లోనే బీఫ్ పార్టీల పేరిట నానా ర‌చ్చ చేస్తున్నాయి. ఈ పార్టీల‌కు కొన్ని రాజ‌కీయ ప‌క్షాలు బ‌హిరంగంగానే వ‌త్తాలు ప‌లుకుతున్న తీరు ప‌రిస్థితి తీవ్ర‌త‌కు ఇట్టే అద్దం ప‌డుతోంది.

ఇదంతా బాగానే ఉన్నా... మ‌న‌సులోని మాట‌ను కుండ‌బ‌ద్ద‌లు కొట్టే రీతిలో మాట్లాడే త‌త్వ‌మున్న బీజేపీ సీనియ‌ర్ నేత‌, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కేబినెట్‌లో కీల‌క మంత్రి, కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య ఈ వ్య‌వ‌హారంపై కూడా త‌న‌దైన శైలిలో స్పష్ట‌త ఇచ్చారు. ఒక‌రి ఆహార అల‌వాట్ల‌పై ఇత‌రులు జోక్యం చేసుకోవ‌డం క్ష‌మార్హం కాద‌న్న రీతిలో వెంక‌య్య చేసిన వ్యాఖ్య‌లు నిజంగానే క‌మ‌ల‌నాథుల‌కు మింగుడుప‌డ‌ని రీతిలోనే ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

అయినా ఈ విష‌యంపై వెంక‌య్య ఏమ‌న్నార‌న్న విష‌యానికి వ‌స్తే... *నేను అస‌లు సిస‌లు మాంసాహారిని. అయినా ఆహారం అనేది వ్య‌క్తిగ‌త ఇష్టాఇష్టాల‌తో ముడిపడి ఉన్న వ్య‌వ‌హారం. ఇది తిన‌కూడ‌దు, ఇది మాత్ర‌మే తినాలి అని నా ఆహారంపై ఇప్ప‌టిదాకా వేరెవ్వ‌రూ జోక్యం చేసుకోలేదు* అని వెంక‌య్య పూర్తి స్ప‌ష్ట‌త‌తో కూడిన వ్యాఖ్య‌లు చేశారు. ఓ మీడియా సంస్థ గోవ‌ధ నిషేధంపై నిర్వ‌హించిన చ‌ర్చ‌లో భాగంగా వెంక‌య్య ఈ వ్యాఖ్య‌లు చేశారు. మ‌రి వెంక‌య్య వ్యాఖ్య‌ల‌పై క‌మ‌ల‌నాథులు ఏమంటారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/