Begin typing your search above and press return to search.

ఎంఎన్ ఎస్ కు అలహాబాదీ గుండా సవాల్!

By:  Tupaki Desk   |   20 Oct 2016 10:46 AM GMT
ఎంఎన్ ఎస్ కు అలహాబాదీ గుండా సవాల్!
X
తనదైన మార్కు స్టేట్ మెంట్స్ తో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ. దేశంలో జరిగే చాలా విషయాలపై తనదైన మార్కు విశ్లేషణ చేసి వివరణ ఇచ్చే కట్జూ.. తాజాగా మహారాష్ట్ర నవనిర్మణ్ సేన ను టార్గెట్ చేశారు. దీనికి కారణం... కరణ్ జోహార్ అప్ కమింగ్ ఫిల్మ్ 'ఏ దిల్ హే ముష్కిల్" విడుదలను ఆపెయ్యడమే! ఈ విషయంపై స్పందించిన కట్జూ... "నిస్సహాయులైన ఆర్టిస్టులపై ఎంఎన్ ఎస్ ఎందుకు దాడిచేస్తుంది.. ధైర్యముంటే నా ముందుకు రండి.. మీ అసహనానికి నా దగ్గర సరైన దండన ఉంది.. మీ కోసమే అది వేచి చూస్తుంది" అంటూ ట్వీట్ లు చేశారు. ఇదే క్రమంలో... ఎంఎన్ ఎస్ ప్రజలు అరేబియన్ సముద్రపు ఉప్పు నీరు తాగే గూండాలు అని వ్యాఖ్యానించిన కట్జూ... తాను మాత్రం గంగా - యమునా - సరస్వతి త్రివేణి సంగమ పవిత్ర నీరు తాగే అలహాబాదీ గూండానని పేర్కొన్నారు. తన ముందుకు వస్తే ఎవరు అతిపెద్ద గూండానో తేల్చుకుందామని సవాలు విసిరారు.

ఇదే సమయంలో మహారాష్ట్ర నవనిర్నాణ్ సేన రాజకీయ శక్తిసామర్ధ్యాలపై కూడా వ్యంగ్యంగా స్పందించిన కట్జూ.... ఒకేఒక్క ఎమ్మెల్యే పార్టీ ఎంఎన్ ఎస్ - వారి పాఠాలను వారే నేర్చుకోలేకపోతున్నారు, వచ్చే ఎన్నికల్లో జీరో ఎమ్మెల్యే పార్టీగా ఎంఎన్ ఎస్ నిలుస్తుంది అని ట్వీట్ చేశారు. ఈ రేంజ్ లో సాగిన కట్జూ వ్యాఖ్యలపై ఎంఎన్ ఎస్ వైస్ ప్రెసిడెంట్ వాగీశ్ సారస్వత్ మండిపడ్డారు. కనీసం తమకు ఒక్క ఎమ్మెల్యే అయినా ఉన్నారని, కట్జూ ఏ ఆధారాలతో తమపై ఇలా వ్యాఖ్యానిస్తున్నారని ప్రశ్నించారు. కాగా, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు అధినేతగా ఉన్న కట్జూ ఇప్పటికే పలు అంశాలపై తనదైన శైలిలో తీవ్రంగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/