Begin typing your search above and press return to search.
తాగి రచ్చ చేసిన ఐఏఎస్ కుమార్తె!
By: Tupaki Desk | 26 Aug 2018 5:29 AM GMTఫుల్ గా తాగటం.. రూల్స్ ను బ్రేక్ చేయటం.. అదేమంటే.. మా నాన్న ఎవరో తెలుసా? అంటూ వీరంగం వేయటం. ఇప్పటివరకూ ఇలాంటివి అబ్బాయిలే చేస్తుండేవారు. ఇప్పుడు అమ్మాయిల వంతు వచ్చేసింది. గడిచిన కొద్దికాలంగా ఫుల్ గా తాగేసిన అమ్మాయిలు రోడ్లపై వీరంగం వేస్తున్న వైనం అంతకంతకూ పెరుగుతోంది.
ఇటీవల కాలంలో పలు సందర్భాల్లో డ్రంకెన్ డ్రైవ్ లో అమ్మాయిలు పట్టబడి రచ్చ రచ్చ చేయటం.. పోలీసులకు చుక్కలు చూపించటం.. ఇష్టానుసారం డ్రైవ్ చేసి ప్రమాదాలకు కారణం కావటం తెలిసిందే. తాజాగా అలాంటి రచ్చనే చేశారో యువతి. అయితే.. ఆ అమ్మాయిగారు ఏపీకి చెందిన ఒక ఐఏఎస్ అధికారి కుమార్తె కావటం విశేషం.
అంతేనా.. తండ్రి అధికారిక కారు(?) ను ఉపయోగిస్తూ డ్రంకెన్ డ్రైవ్ లో అడ్డంగా దొరికిపోయారు. టీఎస్ 09 ఈటీ2000 పేరుతో రిజిష్టర్ అయిన కారు ముందు ఆమె తండ్రి హోదాను ప్రతిబింబించేలా గుర్తు ఉండటం గమనార్హం. ఫుల్ గా తాగేసిన కారు నడిపిన ఈ యువతిని గీతాంజలిగా గుర్తించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు 36లో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఆమెను పరీక్షించేందుకు పోలీసులు ప్రయత్నించారు.
అయితే.. ఆమె అందుకు ససేమిరా అనటమే కాదు.. తాను ఐఏఎస్ అధికారి కుమార్తెనంటూ హడావుడి చేసింది. బ్రీత్ ఎనలైజర్ పరీక్షలకు నో అంటే నో చెప్పింది. దీంతో.. మహిళా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. దాదాపు రెండు గంటల పాటు ఆమె పరీక్షలకు ససేమిరా అన్నారు. తన దురుసు ప్రవర్తనతోచుక్కలు చూపించిన ఆ యువతి చివరకు పరీక్షలు నిర్వహించగా బీఏసీ కౌంట్ 141గా పోలీసులు గుర్తించారు. దీంతో.. ఆమె కారును జప్తు చేసిన అధికారులు ఆమెపై కేసు నమోదు చేశారు. కొసమెరుపు ఏమంటే.. సివిల్స్ పరీక్షల కోసం సిటీలో ప్రిపేర్ అయ్యేందుకు ఉంటున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. సివిల్స్ కు ప్రిపేర్ అయ్యేవారికి.. తాగి కారు నడపకూడదన్న చిన్న విషయం తెలీకపోవటం ఏమిటో..?