Begin typing your search above and press return to search.

నా సోదరుడు బీజేపీలోకి వెళ్లినా తాను మాత్రం వైకాపాలోకి వెళ్తా

By:  Tupaki Desk   |   27 Jun 2019 6:50 AM GMT
నా సోదరుడు బీజేపీలోకి వెళ్లినా తాను మాత్రం వైకాపాలోకి వెళ్తా
X
ఏపీలో టీడీపీ ఖాళీ అవుతుంది. పలువురు ప్రజా ప్రతినిధులు మరియు పార్టీ నాయకులు ఒక్కరొక్కరుగా పార్టీ మారుతున్నారు. పలువురు నాయకులు ఇప్పటికే బీజేపీలో చేరిన విషయం తెల్సిందే. తాజాగా తెలుగు దేశం పార్టీ సీనియర్‌ నాయకుడు మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ బీజేపీలో చేరిన విషయం తెల్సిందే. అంబికా కృష్ణ బీజేపీలో చేరిన నేపథ్యంలో ఆయన సోదరుడు అయిన అంబికా రాజా కూడా బీజేపీలో చేరినట్లుగా కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి. ఆ వార్తలను అంబికా రాజా కొట్టి పారేశాడు.

ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అయిన అంబికా రాజా మీడియా ముందుకు వచ్చారు. తాను బీజేపీలో జాయిన్‌ అయినట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదు. ఆ వార్తలను నా స్నేహితుల ద్వారా తెలుసుకుని ఆశ్చర్యపోయాను. నేను బీజేపీలో చేరకుండానే చేరినట్లుగా వార్తలు రావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం తాను హైదరాబాద్‌ లో ఉన్నట్లుగా పేర్కొన్నాడు. తన సోదరుడు బీజేపీలో చేరినా కూడా తాను మాత్రం వైకాపాలో జాయిన్‌ అవ్వబోతున్నట్లుగా ప్రకటించాడు.

తనకు మొదటి నుండి కూడా వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి అంటే చాలా అభిమానం అని.. వైఎస్‌ ఆర్‌ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానంను సంపాదించుకున్నారని అంబికా రాజా అన్నారు. అలాంటి నేత తనయుడు అయిన వైఎస్‌ జగన్‌ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాను. త్వరలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని సమక్షంలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైకాపాలో జాయిన్‌ అవుతానంటూ అంబికా రాజా ప్రకటించారు. వైకాపాలో తాను ఎలాంటి పదవి ఆశించకుండా పని చేస్తానన్నారు. ఆర్యవైశ్యులు ఎప్పుడు కూడా ప్రజలకు సేవ చేయాలనుకుంటారు. అదే తరహాలో తాను కూడా వైకాపాలో చేరి జనాలకు సేవ చేయాలని భావిస్తున్నట్లుగా అంబికా రాజా అన్నారు.