Begin typing your search above and press return to search.
రెగ్యులర్ రాజకీయ నేత ను కానుః పవన్ కల్యాణ్
By: Tupaki Desk | 16 Nov 2019 6:49 AM GMTతను నిత్యం రాజకీయాలు చేసే నేత ను కాదంటూ పవన్ కల్యాణ్ ప్రకటించుకోవడం ఆసక్తిదాయకంగా మారింది. తను ప్రజలు సమస్యల్లో ఉన్నప్పుడే స్పందిస్తానంటూ పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. ఇలా రాజకీయాల్లో తన గెస్ట్ అప్పీరియన్స్ గురించి పవన్ కల్యాణే వివరించినట్టు గా అయ్యింది.
రాజకీయ నేత అంటే నిత్యం ప్రజల్లో ఉండాలనే భావన ఒకటి ఉంది. ఆఖరికి పంచాయతీ ప్రెసిడెంట్ విషయంలో అయినా ప్రజలు అలాగే ఆలోచిస్తారు. ఆ స్థాయి వ్యక్తి కూడా ఎప్పుడూ ప్రజలకు అందుబాటులోనే ఉండాలనే అనుకుంటారు, అయితే పవన్ కల్యాణ్ ఒక పార్టీకి ప్రెసిడెంట్ అయినప్పటికీ అప్పుడప్పుడే ప్రజల మధ్యన కనిపిస్తారు,.
ఈ ధోరణి పై విమర్శలు లేకపోలేదు. పవన్ ను పార్ట్ టైమ్ పొలిటీషియన్ గానే పరిగణిస్తూ ఉన్నారు విశ్లేషకులు కూడా. అందుకు తగ్గట్టు గా ప్రజలు కూడా పవన్ ను కనీసం ఎమ్మెల్యే గా గెలిపించలేదు. ఇదంతా పార్ట్ టైమ్ రాజకీయాల వల్లనే అనేది బహిరంగ రహస్యం.
ఇలాంటి నేపథ్యం లో పవన్ ఆ విషయం పై స్పందించారు. తను నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడని కాదంటూ చెప్పుకొచ్చారు. త్వరలో నే పవన్ మళ్లీ మొహాని కి రంగేసుకుని నటించడానికి రంగం సిద్ధం అవుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. జనవరి నుంచి పవన్ కొత్త సినిమాల షూటింగులు మొదలు కాబోతున్నట్టు గా భోగట్టా. అందుకు జనాలను ప్రిపేర్ చేయడానికే పవన్ ఈ మాట మాట్లాడి ఉండవచ్చని కూడా విశ్లేషకులు అంటున్నారు.