Begin typing your search above and press return to search.

ట్రంప్ ను వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

By:  Tupaki Desk   |   27 April 2020 1:40 PM IST
ట్రంప్ ను వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?
X
ట్రంప్ ..వివాదాస్పదమైన వ్యాఖ్యలకి కేరాఫ్. ఒకవైపు అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తుంది ..అయినప్పటికీ కూడా ట్రంప్ తన వ్యవహారశైలిని మార్చుకోవడంలేదు. అవగాహన లేని, బాధ్యతారహిత ప్రకటనలతో నవ్వులపాలవుతన్న అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి మీడియాపై చిందులు తొక్కారు. తన వ్యాఖ్యలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రెండు రోజుల క్రితం ఫినాయిల్ ఎక్కిస్తే కరోనా చచ్చిపోతుందని ట్రంప్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. అయితే, దీని పై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

అమెరికా చరిత్రలోనే తానొక కష్టపడి పనిచేసే ప్రెసిడెంట్‌ ను అని ట్విటర్‌ లో వెల్లడించారు. అలాంటి వ్యక్తిపై కొందరు కావాలని తప్పుడు వార్తలు ప్రచారంలోకి తెస్తారని, అధికారంలోకి వచ్చిన తొలి మూడున్నర సంవత్సరాల్లో దేశం అద్భుతమైన ప్రగతి సాధించేలా పనిచేశానని చెప్పుకొచ్చారు. ఉదయం మొదలు రాత్రి పొద్దు పోయే వరకు వైట్‌ హౌజ్‌లో పని చేస్తూనే ఉంటానని, కొన్ని నెలలపాటు స్వేత సౌధాన్ని విడిచిపెట్టి వెళ్లింది లేదన్నారు.

కానీ, కొన్ని మీడియా సంస్థల్లో నన్ను విమర్శిస్తూ కథనాలు వచ్చాయి’అని న్యూయార్క్‌ టైమ్స్‌ను ఉద్దేశించి మరో ట్వీట్‌ లో ఆగ్రహం చేశారు. తప్పుడు వార్తలు రాసే మీడియా సంస్థలు, ఫేక్‌ న్యూస్‌ ప్రచారం చేసే సంస్థల పైన దావా వేస్తామన్నారు. అయితే, ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపై అన్ని వర్గాల నుంచే కాక.. ట్రంప్‌ సొంత పార్టీనుంచి సైతం తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి. ఇకపోతే, అమెరికా లో కరోనా కేసులు 10 లక్షలకు చేరుకున్నాయి. మరణాలు కూడా 60 వేలకు దగ్గరగా ఉన్నాయి. రోజుకి 3 వేల వరకు అక్కడ ప్రాణాలు కోల్పోతున్నారు.