Begin typing your search above and press return to search.

జయ ఆస్తుల వారసురాలి ని నేనే: శశికళ

By:  Tupaki Desk   |   26 Dec 2019 9:27 AM GMT
జయ ఆస్తుల వారసురాలి ని నేనే: శశికళ
X
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణించేనాటికి కోట్ల విలువ చేసే స్థిర చర ఆస్తులను కలిగి ఉన్నారు. ఆమెకు భర్త, పిల్లలు లేకపోవడంతో ఆస్తులన్నీ ఎవరికి పోతాయనే టెన్షన్ ఉండేది. జయలలితకు ప్రాణ స్నేహితురాలు అయిన శశికళనే జయ ఆస్తులను కొల్ల గొట్టిందన్న ప్రచారం సాగింది.

ఇటీవలే పెద్ద నోట్ల తర్వాత శశికళ తన వద్దనున్న పాత రూ.500, రూ.1000 నోట్లు రూ.1674 కోట్లతో తమిళనాడు వ్యాప్తం గా స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు ఐటీశాఖ తాజాగా హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఇది సంచలనమైంది. షాపింగ్ మాల్స్, సాఫ్ట్ వేర్ కంపెనీలు సహా చాలా ఆస్తులను కొన్న వైనం వెలుగుచూసింది.

తాజాగా శశికళ ఆదాయపు పన్ను శాఖ ఇచ్చిన నోటీసుల మేరకు తన ఆదాయాల గురించి వివరించింది. ఇందులో జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్ తనదేనని ఇద్దరు భాగస్వాములమని పేర్కొంది. ఇక అన్నాడీఎంకే పత్రిక ‘నమదు ఎంజీఆర్’, జయా ప్రింటర్స్ లో పెట్టుబడులు ఉన్నాయని శశికళ పేర్కొంది. జయలలిత కు చెందిన జయ ఫామ్ హౌస్, జెఎస్ హౌసింగ్ డెవలప్ మెంట్, జయ రియల్ ఎస్టేట్, గ్రీన్ ఫామ్ హౌస్ లలో కూడా శశికళ భాగస్వామి అని పేర్కొంది. జయ ఆస్తులన్నింటినికి భాగస్వామిగా తానేనని.. తనకే చెందుతాయని శశికళ పేర్కొనడం హాట్ టాపిక్ గా మారింది.