Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ పై చెప్పులు వేయించింది ఎవరో అందరికి తెలుసు
By: Tupaki Desk | 1 April 2019 11:50 AM GMTకలెక్షన్ కింగ్ రూటే సపరేట్. ఆయన ఏం మాట్లాడినా సూటిగా సుత్తి లేకుండా మాట్లాడతాడు. వైసీపీ లో జాయిన్ అవ్వకముందు నుంచి చంద్రబాబు ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తున్న మోహన్ బాబు.. వైసీపీ లో చేరిన తర్వాత తన స్పీడ్ పెంచారు. రెండు రోజులకు ఒకసారి ప్రెస్‌మీట్ పెట్టి మరీ చంద్రబాబుని ఏకేస్తున్నారు. మొన్నటికి మొన్న విజయవాడ లో ప్రెస్‌మీట్ పెట్టిన మోహన్ బాబు.. చంద్రబాబు అవినీతి మొత్తం తనకు తెలుసు అని అన్నారు. నువ్వు, నీ చుట్టూ ఉన్నవాళ్లు అంతా అవినీతి పరులే అని ఆరోపించారు. ఇవాళ తన ఎన్నికల ప్రచారాన్ని మంగళగిరి నుంచి మొదలపెట్టారు కలెక్షన్ కింగ్. మంగళగిరి నుంచి వైసీపీ తరపున పోటీ చేస్తున్న ఆళ్ల రామకృష్ణా రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మోహన్‌బాబు.. చంద్రబాబు, ఆయన ప్రభుత్వం పై కీలక వ్యాఖ్యలు చేశారు.
"వైస్రాయ్ హోటల్ వద్ద దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పై చెప్పులు వేయడం వాస్తవం. నేను చేసిన తప్పెంటో చెప్పండి బ్రదర్.. తప్పు సరిద్దిదుకుంటాను అని వేడుకున్న అన్నగారి పై చంద్రబాబే దగ్గరుండీ మరీ చెప్పులు వేయించాడు. ప్రస్తుతం ఉన్న టీడీపీ అన్నయ్యది కాదు. చంద్రబాబు ఆక్రమించిన పార్టీ. అన్నయ్యేదే అయితే నేను పార్టీ వదిలేవాడిని కాదు. ఆ మహానేత పార్టీనే ఆక్రమించి ఆయన సభ్యత్వాన్నే తీసేసిన వ్యక్తి చంద్రబాబు. ఎన్టీఆర్ కుటుంబాన్ని సర్వనాశనం చేశారు. హరికృష్ణ - తారక్ - సుహాసినిలను వాడుకుని వదిలేశారు. ఎవరైనా బాగుంటే చాలు.. వారిని నాశనం చేసే వరకు నా స్నేహితుడు చంద్రబాబు వదలరు. ఆ సమయంలో అన్నయ్య చంద్రబాబు పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీడీలు విడుదల చేశారు. చంద్రబాబు పాపిష్టి - నికృష్టుడు - మోసకారని ఆ వీడియోల్లో ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు పదికాలాలు పాటు బావుండాలి. కానీ ముఖ్యమంత్రి కాకూడదు. ఎందుకంటే.. మరోసారి ముఖ్యమంత్రి అయ్యే అర్హత చంద్రబాబుకు లేదు. అది కేవలం జగన్‌కు మాత్రమే ఉంది. మంగళగిరిలో మీ అందుబాటులో ఉండే రామకృష్ణా రెడ్డిని, గుంటూరు ఎంపీగా మోదుగు వేణుగోపాల్ రెడ్డిలను గెలిపించండి. చిత్తూరు నుంచి వచ్చిన వ్యక్తుల వల్ల ఏం లాభం లేదు.." అని అన్నారు మోహన్ బాబు.