Begin typing your search above and press return to search.
బాలాకోట్ దాడుల్లో కాంగ్రెస్ నాయకుడు చనిపోయారా?
By: Tupaki Desk | 28 April 2019 6:15 AM GMTభారత వాయుసేన పాకిస్తాన్ లోని బాలాకోట్ స్థావరంపై జరిపిన దాడులు ఇంకా మర్చిపోలేదు కదా. బాలాకోట్ దాడుల తర్వాత భారత భూభాగంలోకి పాక్ యుద్ధవిమానాలు రావడం.. వాటిని వెంబడిస్తూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్ చేతికి చిక్కడం వంటివన్నీ తెలిసిందే. అయితే.. బాలాకోట్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత వాయుసేన జరిపిన దాడుల్లో ఇండియాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ లీడర్ చనిపోయారన్న వార్త ఒకటి సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది.
ఈ ఏడాది ఫిబ్రవరి 26న బాలాకోట్ దాడులు జరిగాయి. అంటే సుమారు రెండు నెలల కిందటన్నమాట. కానీ, ఎందుకో ఇప్పుడు ఆ ఘటనలో కాంగ్రెస్ నేత ఒకరు చనిపోయారన్న ప్రచారం జరుగుతోంది. ఆ నేత ఎవరో కాదు మణిశంకర్ అయ్యర్. దీంతో తాను చనిపోయినట్టు సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్న వార్తలపై కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ స్పందించారు. తాను భేషుగ్గా ఉన్నానని - ఇంకా బతికే ఉన్నానని - లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో ఊపిరి సలపకుండా ఉన్నానని స్పష్టం చేశారు.
‘‘నేను చనిపోయానని ఆశించిన వారికి ఇది విచారం కలిగించే వార్తే. నేను ఇంకా సజీవంగానే ఉన్నాను’’ అని అయ్యర్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో తాను తీరికలేకుండా ఉన్నానని - ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ - లక్నో నగరాలకు వెళ్తున్నట్టు చెప్పుకొచ్చారు. కాగా, మణిశంకర్ అయ్యర్ నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోని వ్యక్తిగా ఉంటారు. 2017లో గుజరాత్ ఎన్నికల్లో మోదీని ‘నీచ్ ఆద్మీ’గా పేర్కొని వివాదంలో చిక్కుకున్నారు. మణిశంకర్ వ్యాఖ్యలపై అప్పట్లో రాహుల్ గాంధీ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా మణిశంకర్ పై ఈ విధంగా ఆన్ లైన్లో దుష్ప్రచారం సాగడం వెనుక బీజేపీ శ్రేణుల హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.