Begin typing your search above and press return to search.
వీడి విషయంలోనూ పోరాడతారా?
By: Tupaki Desk | 6 Aug 2015 5:28 AM GMTప్రాణాలు తీసిన కసాయి విషయంలో నీతులు వల్లించే నేతలు దేశంలో భారీగానే ఉన్నారు. నేరం.. దాని తీవ్రత కంటే కూడా.. సదరు వ్యక్తి ఉగ్రవాది అయినా.. మరొకటి అయినా.. వాడి మతం ఆధారంగానో.. మరో విషయాన్నో తెరపైకి తీసుకొచ్చి దోషులకు విధించే శిక్షల మీద తెగ వాదనలు వినిపించేస్తుంటారు. దేశంలోని ఇలాంటి నీతులు చెప్పే హక్కుల నేతల గురించి తెలుసుకున్న ఉగ్రవాద సంస్థలు.. దేశంపై దాడి చేసేందుకు సరికొత్త విధానాన్ని అనుసరిస్తుందన్న విషయం తాజాగా బయటకు వచ్చింది.
జమ్మూ కాశ్మీర్ లోని ఉధం పూర్ వద్ద సైనికుల వాహనంపై దాడి చేసి.. అనంతరం తప్పించుకునే ప్రయత్నం చేసిన ఉగ్రవాదుల్లో ఒకరిని సజీవంగా పట్టుకోవటం తెలిసిందే. ఇతగాడిని ప్రాధమికంగా విచారించిన నేపథ్యంలో.. ఒక ఆశ్చర్యకరమైన విషయం బయటకు వచ్చింది. అదేమిటంటే.. పాకిస్థాన్ లోని పలు ఉగ్రవాద సంస్థలు.. కుర్రాళ్లకు ఉగ్రపాఠాలు బోధించి.. భారత్ మీదకు ప్రయోగించే సమయంలో.. వారు కానీ ఒకవేళ పట్టుబడితే.. వయసు 16 ఏళ్లుగా చెప్పాలని చెబుతారని వెల్లడించాడు.
దేశంలోని చట్టాల ప్రకారం 18 ఏళ్ల లోపు ఉన్న వారు.. ఎంత తీవ్రమైన నేరం చేసినా దాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించకుండా.. వారికి కఠిన శిక్షలు పడకుండా ఉండే వెసులుబాటు చట్టంలో ఉన్న నేపథ్యంలో.. ఉగ్రవాదుల్ని దేశంలోకి పంపే సమయంలో.. ఒకవేళ పట్టుబడితే.. వయసు 16 ఏళ్లు మాత్రమేనని చెప్పాలని నూరిపోస్తారట.
అలా చేస్తే.. ఉగ్రవాదుల్ని భారత్ లో కఠినంగా శిక్షించలేరన్నది వ్యూహంగా కనిపిస్తోంది. చూస్తుంటే.. రానున్న రోజుల్లో ఇరవై ఏళ్ల వయస్కుల్ని భారత్ మీదకు దాడికి పంపి.. ఒకవేళ పోలీసులకు కానీ దొరికిపోతే.. తమ వయసు 16 దాటలేదని బుకాయించాలని ట్రైనింగ్ ఇస్తుంటాయని తాజాగా తేలింది.
మరి.. ఉగ్రవాదులు.. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల.. అనవసరమైన జాలిని వదిలేసి.. జాతి రక్షణ కోసం పని చేసేలా హక్కుల నేతలు వ్యవహరించటంతోపాటు.. ఉగ్రవాదుల తాజా ప్లాన్ బయటకు వచ్చిన నేపథ్యంలో దేశంలో అమలు చేస్తున్న చట్టాల్ని మార్చటంతో పాటు.. హక్కుల నేతలంటూ హడావుడి చేసే వారు.. తాజా నిజం చూసైనా బుద్ధి తెచ్చుకుంటే బాగుంటుందన్న భావన వ్యక్తమవుతుంది. మరి. దీనికి హక్కుల నేతలు ఏమంటారో..?