Begin typing your search above and press return to search.

మోడీలా నేను అబ‌ద్ధాలు ఆడ‌లేను

By:  Tupaki Desk   |   31 March 2019 2:14 PM GMT
మోడీలా నేను అబ‌ద్ధాలు ఆడ‌లేను
X
ప్ర‌తి పేద‌వాడి అక్కౌంట్లో 15 ల‌క్ష‌లు వేస్తాను అని అధికారంలోకి వ‌చ్చిన మోడీ సామాన్యుల డ‌బ్బంతా దోచి దేశంలోని 15 మంది సంప‌న్నుల‌కు అప్ప‌గించార‌ని కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ధ్వ‌జ‌మెత్తారు. మోడీ ఒక అబ‌ద్ధాల కోరు అని నేరుగా విమ‌ర్శించారు. ఆయ‌న న‌ల్ల‌ధ‌నంపై ఇచ్చిన హామీ నెర‌వేర‌లేదు. నోట్ల ర‌ద్దుపై ఇచ్చిన హామీ నెర‌వేర‌లేదు. 50 రోజుల్లో మార్పు రాక‌పోతే ఉరి తీయ‌మ‌న్నారు. సిగ్గు లేకుండా మ‌ళ్లీ కాప‌లాదారు అంటున్నారు అని రాహుల్ విమ‌ర్శించారు. ఆయ‌న దొంగ‌ల‌కు మాత్ర‌మే కాప‌లాదారు ఇండియాకు కాద‌ని అన్నారు.

మాట ఇస్తే... దాని మీద నిల‌బ‌డే పార్టీ కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన మూడు రాష్ట్రాల్లో వారంలోపు రుణ‌మాఫీ చేసిన చ‌రిత్ర కాంగ్రెస్‌ ది. ఇక్క‌డ కూడా అధికారంలోకి వ‌స్తే వెంట‌నే రుణ‌మాఫీ చేసి రైతుల‌కు అండ‌గా ఉంటామ‌ని రాహుల్ గాంధీ భ‌రోసా ఇచ్చారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టి రైతుల పంట‌ల‌కు మ‌రింత ధ‌ర వ‌చ్చేలా చేస్తామ‌న్నారు.

ప్ర‌త్యేక హోదాపై మ‌రోసారి ఆయ‌న మాట్లాడారు. కాంగ్రెస్ కు అధికారం... ఏపీకి హోదా. రెండూ ఒకేసారి జ‌రుగుతాయ‌ని రాహుల్ చెప్ప‌డంతో దానిని నినాదంగా చేసుకున్నారు కాంగ్రెస్ వాళ్లు.