Begin typing your search above and press return to search.
విశ్వనాథన్ ఆనంద్ ను మోసం చేసి గెలిచాను.. క్షమించండి !
By: Tupaki Desk | 15 Jun 2021 10:30 AM GMTవిశ్వనాథన్ ఆనంద్ చెస్ లో ఐదుసార్లు వరల్డ్ చాంపియన్. అంతటి మహా మేధావిని గేమ్ లో అనామకుడు, ఓ వ్యాపారవేత్త ఓడించడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే దానికి వెనుక అసలు కారణం తాజాగా వెలుగులోకి వచ్చింది. కరోనా వైరస్ సహాయ నిధి కోసం విరాళాలు సేకరించడానికి చెస్ కింగ్ విశ్వనాథన్ ఆనంద్, పలువురు సెలబ్రిటీలతో ఆదివారం చెస్ గేమ్స్ ఆడాడు. అందులో ఆమిర్ ఖాన్, రితేష్ దేశ్‌ముఖ్ లాంటి బాలీవుడ్ ప్రముఖులు కూడా ఉన్నారు. అయితే వీళ్లలో జెరోదా కంపెనీ కోఫౌండర్ అయిన నిఖిల్ కామత్ , తాను ఆడిన గేమ్‌లో ఆనంద్ ను ఓడించాడు.
ఇది చాలా మందిని ఆశ్చర్య పరిచింది. అందరూ అతడిపై ప్రశంసలు కురిపించారు. కానీ అంతలోనే ఏమనుకున్నాడో, ఆ వ్యాపారి తన తప్పుని అంగీకరిస్తూ అసలు విషయం బయటపెట్టాడు. అందరూ నేను ఆనంద్‌పై గెలిచానని అనుకుంటున్నారు. కానీ గేమ్‌ను చూస్తున్న నిపుణులు, కంప్యూటర్ల సాయంతో ఆడి నేను గెలిచాను. ఇలా చేసినందుకు క్షమించాలి అని కామత్ ట్వీట్ చేశాడు. ఓ చారిటీ మ్యాచ్‌లో ఇలా మోసం చేసి గెలవడం దురదృష్టకరమని, ఇలా జరిగి ఉండాల్సింది కాదని ఆలిండియా చెస్ ఫెడరేషన్ సెక్రటరీ భరత్ చౌహాన్ అన్నారు. చారిటీ మ్యాచ్ లలో ఇలాంటివి ఊహించలేమని చెప్పారు. ఆదివారం వర్చువల్ గా జరిగిన కరోనా వైరస్ రిలీఫ్ చారిటీ మ్యాచ్ లో ఆనంద్ పలువురు ప్రముఖులతో చెస్ ఆడాడు. ఇందులో భాగంగానే జెరోధా కంపెనీ సహ యజమాని నిఖిల్ కామత్ తో పోటీ జరిగింది. నేను నిజంగానే ఆనంద్‌ను ఓడించానని ఎవరైనా భావిస్తే అది పొరపాటే. బోల్ట్‌తో పోటీపడి 100మీ. రేస్ నెగ్గగలమా, ఇదీ అలాంటిదే. ఆనంద్ పై గెలిచేందుకు నేను కంప్యూటర్, ఇతర నిపుణుల సహాయం తీసుకున్నాను. ఇది సరదా కోసం చేసినా ఇలా జరగకూడదు. అందుకు అందరినీ క్షమించాలని వేడుకుంటున్నా అని నిఖిల్ ట్వీట్ చేశాడు. మరోవైపు ఆనంద్ కూడా కామత్ స్టేట్‌మెంట్ ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ కామెంట్ చేశాడు. తాను మాత్రం నిజాయతీగా ఆడానని, ప్రతి ఒక్కరూ ఇలాగే ఆడతారని తాను అనుకున్నానని ట్వీట్ చేశాడు. చెక్‌మేట్ పేరుతో జరిగిన ఈ ప్రోగ్రామ్‌లో సెలబ్రిటీలతో ఆనంద్ ఆడిన గేమ్‌ల వల్ల వచ్చిన డబ్బును కొవిడ్ సహాయక నిధికి ఇవ్వనున్నారు.