Begin typing your search above and press return to search.
పవన్ పై పోటీకి సై అన్న ‘బీకాంలో ఫిజిక్స్’
By: Tupaki Desk | 7 March 2017 10:24 AM GMTతన నియోజకవర్గానికి.. కాస్త పక్కనున్న ఒకట్రెండు నియోకవర్గాలకు పరిచయం ఉన్న టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్.. ఒకే ఒక్కమాటతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ కావటమే కాదు.. సినిమాల్లోనూ.. కామెడీ స్కిట్ లకు పెద్ద ముడిసరుకుగా మారారన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్పారన్నది పక్కన పెడితే.. ఆయన పుణ్యమా అని చాలామంది పలుసార్లు హాయిగా నవ్వుకున్నారనటంలో సందేహం లేదు.
తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తాను ఎన్నికల్లో ఎప్పుడు పోటీ చేసినా గెలిచేస్తానన్న ధీమా వ్యక్తం చేసిన ఆయన.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద పోటీ చేసినా.. కనీసం 10 ఓట్ల తేడాతో అయినా గెలిచేస్తానని వ్యాఖ్యానించటం గమనార్హం. తమ సీఎం చంద్రబాబుకు వచ్చే ఐడియాలు మరెవరికీ రావని.. అడవిలో కూడా అసెంబ్లీ కట్టారని అధినేతను పొగిడేశారు.
అక్కడితో ఆగని ఆయన.. బాబును ఆకాశానికి ఎత్తేసే కార్యక్రమాన్ని కంటిన్యూ చేశారు. ప్రధాని మోడీ కూడా తమ సీఎం ముందుకు ఎందుకు పనికి రాడన్న ఆయన.. అసలు బీజేపీతో తాము ఉండాల్సిన అవసరం ఏమీ లేదని.. రాజకీయంగా కూడా తమకు ఎలాంటి అవసరం లేదన్నారు. మొత్తానికి బాబుకు మిత్రులైన ఇద్దరూ లైట్ అన్న రీతిలో మాట్లాడిన జలీల్ ఖాన్.. తనకు మంత్రి పదవి వస్తుందోరాదో తనకు తెలీదని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో మంత్రి పదవి కంటే ఎమ్మెల్యేగా ఉండటమే మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చూస్తుంటే.. రాని పదవి కోసం ఆశ పడే కన్నాఅసలు అదీ ఓ పదవేనా? అన్నట్లుగా మాట్లాడిన జలీల్.. అధినేతపై అన్నేసి బిస్కెట్లు ఎందుకు వేసినట్లు..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/