Begin typing your search above and press return to search.
అల్లుడుగారు రాజకీయాల్లోకి రారంట
By: Tupaki Desk | 15 April 2016 4:38 AM GMTదేశంలో ఎన్నో ఫ్యామిలీలు ఉన్నా.. ‘గాంధీ’ పేరును ఇంటిపేరుగా మార్చుకొని అంతులేని ప్రయోజనం పొందిన ఫ్యామిలీ ఏదైనా ఉందంటే అది నెహ్రూ కుటుంబమేనని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.అలాంటి ఇంటికి అల్లుడైన అదృష్టం రాబర్ట్ వాద్రాకే చెల్లింది. దేశాన్ని తన రిమోట్ కంట్రోల్ తో కంట్రోల్ చేసే సోనియమ్మను కంట్రోల్ చేయగల సత్తా ఎవరికైనా ఉందంటే.. ‘అల్లుడుగారికి’ మించి ఇంకెవరికి ఉంటుంది.
పదేళ్ల పాటు నాన్ స్టాప్ గా పవర్ ను ఎంజాయ్ చేసిన సోనియమ్మ అండ్ కోతో పాటు.. ఆమె అల్లుడు సైతం అంతేలా చెలరేగిపోయారన్న విమర్శలు తెలిసినవే. రాజకీయాల్లో లేకున్నా.. అధికారికంగా ఎలాంటి పదవి లేకున్నా.. వీవీఐపీ ట్రీట్ మెంట్ తో పాటు.. దేశ ప్రజలు కట్టిన పన్నుతో విశేష సౌకర్యాల్ని పొందటం అల్లుడుగారికి మాత్రమే దక్కిన అదృష్టంగా చెప్పాలి.
అల్లుడిగా తనకున్న హోదాకు సార్థకత తెచ్చిన ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు కాస్త ఆసక్తికరంగా ఉండటమే కాదు.. ‘అమ్మ అల్లుడు’ అనుకోవాల్సిందే. రాబర్ట్ వాద్రాను.. ప్రియాంకతో పెళ్లికి ముందు.. తర్వాత అన్న రెండు భాగాలుగా చూస్తుంటారు. ఈ రెండింటి మధ్య వచ్చిన తేడా స్పష్టంగా కనిపిస్తున్నా.. అలాంటిదేమీ లేదని మాట్లాడటం రాబర్ట్ వాద్రాకే చెల్లుతుంది.
తాజాగా ఆయన మాట్లాడుతూ.. తన లైఫ్ ని మెరుగుపర్చుకునేందుకు భార్య ప్రియాంకా గాంధీ అవసరం తనకు ఎప్పుడూ రాలేదన్న సుద్దులు చెప్పుకొచ్చారు. తనకు అవసరమైనవన్నీ తన తల్లిదండ్రులే అందించినట్లే చెప్పుకున్నాడు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే సామర్థ్యం తన సొంతమని.. తాను పాలిటిక్స్ లో చేరే ఛాన్స్ లేదని స్పష్టం చేవారు. నిజమే మరి.. రాజకీయాల్లో లేకుండానే.. ఎలాంటి పదవి లేకుండానే పవర్ ను ఎలా ఎంజాయ్ చేయాలో తెలిసిన రాబర్ట్ వాద్రా లాంటి బిజినెస్ మ్యాన్ పాలిటిక్స్.. ప్రజాసేవ అంటూ టైమ్ వేస్ట్ చేయరు కదా..?