Begin typing your search above and press return to search.

ప్లకార్డు పట్టుకున్నఆమెను రేప్ చేస్తారట

By:  Tupaki Desk   |   27 Feb 2017 6:04 AM GMT
ప్లకార్డు పట్టుకున్నఆమెను రేప్ చేస్తారట
X
ప్లకార్డు పట్టుకొని సోషల్ మీడియాలో సంచలనంగా మారిన గుర్ మెహర్ కౌర్ మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ఏబీవీపీకి వ్యతిరేకంగా గళం విప్పిన ఆమె.. ఒక ప్లకార్డు పట్టుకొని.. తాను ఢిల్లీ వర్సిటీ విద్యార్థినని.. తాను ఏబీవీపీకి భయపడనని.. తాను ఒంటరిని కానని.. తన వెనుక దేశంలోని విద్యార్థులంతా తన వెనుక ఉన్నట్లుగా చెబుతూ సోషల్ మీడియాలో ఆమె పెట్టిన ఫోటో వైరల్ కావటమే కాదు.. ఏబీవీపీ వ్యతిరేకులంతా ఇప్పుడు ఇదే విధానాన్ని అనుసరిస్తూ.. నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఏబీవీపీకి చెందిన కొందరు ఆమెను రేప్ చేస్తామని బెదిరిస్తున్నట్లుగా ఆమె వాపోతున్నారు.

ఇంతకీ గుర్ మెహర్ కౌర్ ఏబీవీపీని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఆమె ఎందుకలా ప్లకార్డు పట్టుకున్నారన్న విషయంలోకి వెళితే.. గత ఏడాది ఢిల్లీలోని జేఎన్ యూలో జరిగిన ఒక ర్యాలీలో జాతి వ్యతిరేక నినాదాలు చేసి.. ప్రస్తుతం రాజద్రోహం కేసును ఎదుర్కొంటున్న ఉమర్ ఖలీద్ ను రాంజాస్ కాలేజీలో జరిగిన ఒక సెమినార్ కు పిలిచారు.

దీన్ని ఏబీవీపీ వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అతడి రాకను వ్యతిరేకిస్తూ.. ప్రదర్శనను నిర్వహించటం.. ఆ సందర్భంగా మిగిలిన విద్యార్థులకు.. ఏబీవీపీకి చెందిన వారికి మధ్యన తీవ్ర ఘర్షణ నెలకొంది. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్యన దాడులు జరిగాయి. అయితే.. ఏబీవీపీ వారు తమపై అమానుషంగా దాడి చేశారన్నది మిగిలిన విద్యార్థుల ఆవేదన. అదే సమయంలో ఏబీవీపీ వారి వాదన ఏమిటంటే.. రాజద్రోహం కేసును ఎదుర్కొంటున్న వ్యక్తిని సెమినార్ కు ఎందుకు పిలవాలని?

ఇదిలా ఉంటే.. రంజాస్ కాలేజ్ దగ్గర జరిగిన పరస్పర దాడులపై కార్గిల్ అమరవీరుడు.. కెప్టెన్ మన్ దీప్ సింగ్ కుమార్తె గుర్ మెహర్ కౌర్ ఏబీవీపీకి వ్యతిరేకంగా తన గళాన్ని విప్పారు. సోషల్ మీడియాలో ప్లకార్డు పట్టుకున్న ఆమె వైనం వైరల్ గా మారి.. పెద్ద ఎత్తున అదే విధానాన్ని అనుసరిస్తున్నారు. దీనిపై ఆగ్రహం చెందిన ఏబీవీపీ చెందిన వారు.. ఆమెకు తీవ్రస్థాయిలో వార్నింగ్ లు ఇస్తున్నట్లుగా ఆమె చెబుతున్నారు.

తనను జాతి వ్యతిరేకిగా తిడుతున్నారని.. ఎవరైనా దాడి చేస్తామని.. రేప్ చేస్తామని బెదిరిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ అనే వ్యక్తి తాను రాసిన కామెంట్ లో సుదీర్ఘ వివరణ ఇవ్వటమే కాదు.. తనను ఎలా రేప్ చేయాలనుకుంటున్నాడో కూడా అందులో వివరించాడని.. దాన్ని చూసి తనకు చాలా భయం వేసినట్లుగా ఆమె వెల్లడించారు. సైద్దాంతిక విబేధాలు ఈ స్థాయికి దిగజారటం అసలుసిసలు విషాదంగా చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/