Begin typing your search above and press return to search.

బూమ్రా, భువిల వల్ల పీడకలలు: ప్రముఖ క్రికెటర్

By:  Tupaki Desk   |   16 March 2020 6:00 AM GMT
బూమ్రా, భువిల వల్ల పీడకలలు: ప్రముఖ క్రికెటర్
X
ఆ ఇద్దరు భారత క్రికెటర్ల వల్ల నిద్రలేని రాత్రులు గడిపానని ప్రముఖ క్రికెటర్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచం లో చర్చనీయాంశమయ్యాయి. ఇంతకీ అలా పీడకలలు వచ్చిన క్రికెటర్ ఎవరో తెలుసా? ఆస్ట్ర్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్.. ఆయనను భయపెట్టింది ఎవరో తెలుసా? భారత పేస్ బౌలర్లు జస్పీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్.

టీమిండియా పేస్ బౌలర్లు బుమ్రా, భువనేశ్వర్ ల గురించి ఆలోచిస్తూ.. వారిని ఎలా ఎదుర్కోవాలో తెలియక తనకు పీడకలలు వచ్చేవని ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్ ఆరోన్ ఫించ్ వెల్లడించారు. వారిని ఎదుర్కోవడం చాలా కష్టమని ఫించ్ తెలిపారు.

2018 భారత పర్యటన లో ఫించ్ అన్ని ఫార్మట్లలో బుమ్రా, భువిలను ఎదుర్కోవడానికి ఇబ్బంది పడ్డాడు. ఆ పర్యటన లో భువనేశ్వర్ ఏకంగా నాలుగు సార్లు ఫింఛ్ ను ఔట్ చేశాడు. తర్వాత రోజు బుమ్రాను ఎదుర్కోవాల్సి ఉంటుందన్న ఆలోచనతో రాత్రి మెలకువ వచ్చేదని ఫించ్ తన భయాన్ని వ్యక్తం చేశాడు. ఇలా భారత బౌలర్లకు ఆస్ట్రేలియా కెప్టెన్ భయపడ్డాడని అన్న మాటలు వైరల్ గా మారాయి.