Begin typing your search above and press return to search.

పీసీసీ చీఫ్ రేసులో ఉన్నా: జగ్గారెడ్డి

By:  Tupaki Desk   |   7 Dec 2020 4:50 PM GMT
పీసీసీ చీఫ్ రేసులో ఉన్నా: జగ్గారెడ్డి
X
‘ఆలు లేదు.. చూలు లేదు.. తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ నేనే’ అంటూ కాంగ్రెస్ సీనియర్లు ప్రకటనల మీద ప్రకటనలు గుప్పిస్తున్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి రేసులో ఇప్పుడు సీనియర్ నేతలు పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నారు. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పీసీసీ చీఫ్ రేసులో తానే ముందు ఉన్నానని ప్రకటించాడు. ఇక శ్రీధర్ బాబు సైతం లైన్లోకి వచ్చాడు.

ఈ క్రమంలోనే తెలంగాణ పీసీసీ చీఫ్ రేసులో తాను ఉన్నట్లు కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించాడు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే మెడిసిన్ తన దగ్గర ఉందని చెప్పుకొచ్చాడు.. పీసీసీ అధ్యక్షుడికి డబ్బులు ఉండాలనేది తప్పుడు అభిప్రాయమని కొట్టిపారేశారు. కాంగ్రెస్ నేతల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నా ఐక్యత మాత్రం దెబ్బతినదని స్పష్టం చేశారు.

అంబానీ, అదానీ, అమెజాన్ కు లాభం చేయడానికే కేంద్రం కొత్త వ్యవసాయ చట్టాలు తెచ్చారని ఆరోపించారు. ఈ చట్టం వల్ల రైతులు లేకుండా పోతారని మండిపడ్డారు. రైతు సంఘాల భారత్ బంద్ కు కాంగ్రెస్ మద్దతు తెలుపుతుందని అన్నారు. బాంబే హైవే దిగ్బంధం చేస్తున్నట్లు వెల్లడించారు. తాను సంగారెడ్డిలో రోడ్డుపై కూర్చుంటానని తెలిపారు. కేంద్రం కార్పొరేట్ కు కొమ్ము కాస్తోందని జగ్గారెడ్డి విమర్శించారు. రైతులను నాశనం చేసే వ్యవసాయ చట్టాలను కేంద్రం తెచ్చిందని జగ్గారెడ్డి విమర్శించారు..