Begin typing your search above and press return to search.
మోడీకి కెనడా ప్రధాని ‘సిక్కు’ షాక్
By: Tupaki Desk | 14 March 2016 4:07 AM GMTఅక్కడెక్కడో ఉన్న కెనడా ప్రధాని తాజాగా చేసిన ఒక వ్యాఖ్య ప్రధాని మోడీకి షాక్ తగిలేలా చేయటం ఖాయంగా ఉంది. సిక్కులకు మోడీ కంటే తానే పెద్ద పీట వేశానంటూ ఆయన చేసిన తాజా వ్యాఖ్య సిక్కుల్లో మంట పుట్టించటం ఖాయమంటున్నారు. మోడీ క్యాబినెట్ లో కంటే కూడా.. తన క్యాబినెట్ లోనే సిక్కులకు ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించినట్లుగా చెప్పిన మాట.. ఆ వర్గం వారికి మోడీ మీద ఆగ్రహం కలిగించే అవకాశం ఉందని చెప్పక తప్పదు.
సిక్కు వర్గానికి మోడీ సర్కారులో సరైన ప్రాతినిధ్యం లేదన్న మాటను తాజాగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడెయు వ్యాఖ్యానించారు. అమెరికాలోని ఒక విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కెనడా ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయనకు ప్రశ్నలు వేసే క్రమంలో ఒక విద్యార్థి మాట్లాడుతూ.. ‘‘మీ క్యాబినెట్ లో ఎక్కువ మంది సిక్కులు ఉండటం గొప్ప విషయం’’ అని వ్యాఖ్యానించాడు.
దీనికి స్పందించిన కెనడా ప్రధాని జస్టిన్.. ‘‘భారత ప్రధాని మోడీ మంత్రివర్గంలో కంటే నా క్యాబినెట్ లోనే ఎక్కువమంది సిక్కులు ఉన్నారు. నలుగురు సిక్కులు మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు. దేశం కాని దేశంలో సిక్కులకు పెద్దపీట వేస్తే.. సొంత దేశంలో తమకు ప్రాతినిధ్యం పెద్దగా లేకపోవటాన్ని సిక్కులు సీరియస్ గా తీసుకోవటంతో పాటు.. మోడీ మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు. మోడీతో పోలిస్తే సిక్కులకు తానే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానన్న మాట ఏ ఉద్దేశంతో చెప్పినా.. కెనడా ప్రధాని మాటలు భారత ప్రధానికి ఇబ్బందిని కలిగించటం మాత్రం గ్యారెంటీ అని చెబుతున్నారు.