Begin typing your search above and press return to search.
అదంతా ఫేక్ న్యూస్ : బిల్ గేట్స్
By: Tupaki Desk | 25 July 2020 8:15 AM GMT"కరోనా వైరస్ అనేది ఓ పెద్ద కుట్ర.. ఈ వినాశనానికి కారణం మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్‌గేట్స్. వ్యాక్సిన్ పేరుతో ఆయన మనుషుల్లో ట్రాకింగ్ పరికరాలను పెట్టబోతున్నారు" ఈ విధమైన ఫార్వర్డ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అవుతుంది. కరోనాతో అష్టకష్టాలు పడుతున్న కొందరు సామాన్యులు , ప్రముఖులు కూడా ఈ న్యూస్ చూసి కరోనా కి కారణం బిల్ గేట్స్ అని అయన పై కామెంట్స్ చేస్తున్నారు. ఈ ప్రచారం గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నా కూడా ఇప్పటివరకు ఎక్కడా దీనిపై నోరు విప్పని బిల్ గేట్స్ తాజాగా దీనిపై స్పందించారు.
ఈ వార్తలని అయన ఖండించారు. తాము వ్యాక్సిన్ల అభివృద్ధికి విరాళాలు ఇచ్చామని.. ఆ వ్యాక్సిన్లకు, ట్రాకింగ్ పరికరాలకు ఎలాంటి సంబంధం లేదని.. ఇలాంటి వార్తలు ఎక్కడినుండి పుట్టుకొస్తాయి కూడా తెలియడం లేదు అని తెలిపారు. ప్రజలు అసలు నిజాలు తెలుసుకునే కొద్ది, ఈ తరహా వార్తలు కనిపించకుండా పోతాయి అని, కా రోనా వైరస్ కి ఎలాగైనా ముగింపు పలకాలన్నదే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ కరోనా వ్యాక్సిన్ కోసం 100 మిలియన్ డాలర్లను ఈ ఏడాది ఫిబ్రవరిలో విరాళం ప్రకటించింది. అంటే దాదాపుగా రూ.750 కోట్లు. వైరస్ కట్టడికి 675 మిలియన్ డాలర్లు కావాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన పిలుపునకు స్పందనగా గేట్స్ ఫౌండేషన్ ఈ విరాళాన్ని ప్రకటించింది. ఆ తరువాత గ్లోబల్ అలయెన్స్ ఫర్ వ్యాక్సిన్స్ అండ్ ఇమ్యూనైజేషన్ కు 167 కోట్ల డాలర్ల విరాళాన్ని ఇవ్వనున్నట్టు గేట్స్ ఫౌండేషన్ ప్రకటించింది