Begin typing your search above and press return to search.
‘ఫత్వా’లకు మంట పుట్టేలా మాట్లాడింది
By: Tupaki Desk | 24 Jan 2017 9:42 AM GMTఒక ముస్లిం మహిళ సొంత మతాన్ని విమర్శించటమా? మంచిచెడుల గురించి మాట్లాడటమా? తనకు అనిపించిది బయటకు చెప్పడమా? అన్న ప్రశ్నలు వాడిగా వేడీగా వినిపిస్తుంటాయి పలువురు దగ్గర నుంచి. వివాదాస్పద రచయిత్రిగా కొందరి దృష్టిలో ఉండే బంగ్లాదేశ్ కు చెందిన తస్లీమా నస్రీన్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత దేశానికి ఉమ్మడి పౌరస్మృతి అవసరమని వాదించే వారిపై ఒంటికాలిపై లేచే అసదుద్దీన్ ఓవైసీ లాంటి మత నాయకులకు మంటపుట్టేలా ఆమె వ్యాఖ్యలుచేశారు.
అంతేకాదు.. ఇస్లాంను వ్యతిరేకిస్తే చాలు.. ఫత్వాలు జారీ చేస్తారు.. చంపాలని చూస్తారంటూ తనలోని ఆగ్రహాన్ని ఓపెన్ గా చెప్పేయటమే కాదు.. ఆసక్తికరమైన పలు వ్యాఖ్యల్ని ఆమె చేశారు. జైపూర్ లో జరుగుతున్న ‘‘జైపూర్ సాహిత్యోత్సవం’’ సదస్సుకు అనూహ్యంగా హాజరైన తస్లీమా నస్రీన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇస్లాంను విమర్శించటమే ఇస్లామిక్ దేశాల్లో లౌకికవాదం నెలకొల్పడానికి మార్గంగా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఆమె రాకపై ముస్లిం సంఘాలు వ్యతిరేకిస్తూ ఆందోళన వ్యక్తం చేశాయి. తస్లీమాను బంగ్లాదేశ్ వెళ్లగొట్టిందని.. ఈ దేశంలో బతికేందుకు అనుమతిస్తే.. ఆమెమరీ ఎక్కువ స్వేచ్ఛ తీసుకుంటొందని రాజస్థాన్ ముస్లిం ఫోరం కన్వీనర్ కారీ మొయినుద్దీన్ నిప్పులు చెరగటం గమనార్హం. మరోవైపు ఈ సదస్సులో ప్రసంగించిన తస్లీమా.. తానుకానీ ఇతరులుకానీ హిందూయిజం గురించి.. బుద్దిజం గురించి కానీ ఇతర మతాల గురించి కానీ విమర్శిస్తే ఏమీ జరగదని.. కానీ.. ఇస్లాంను విమర్శించిన వెంటనే జీవితకాలం వ్యక్తులు వెంటాడుతూ ఉంటారన్నారు.
‘‘మీకు వ్యతిరేకంగా ఫత్వాలు జారీ చేస్తారు. మిమ్మల్ని చంపాలని చూస్తారు. కానీ.. వాళ్ల అలా ఎందుకు చేస్తున్నారు? నా మాటల్నివారు ఒప్పుకోనప్పుడు.. నా వాదనలు వారికి నచ్చనప్పుడు నాకు వ్యతిరేకంగా రాయొచ్చు.కానీ.. ఫత్వాలు జారీ చేయటం ఏమిటి? చంపాలని చూడటం ఏమిటి? ఫత్వాలు ఎందుకు.. మాట్లాడితే సరిపోతుంది కదా?’’ అని వ్యాఖ్యానించారు. ముస్లిం మహిళలు అణిచివేతకు అడ్డుకట్ట వేయటానికి.. వారికి మరింత రక్షణ.. భద్రత కల్పించటానికి ఉమ్మడి పౌరస్మృతి అవసరమని ఆమె వ్యాఖ్యానించారు. ఉమ్మడి పౌరస్మృతి మాట వింటేనే మండిపడే అసద్ లాంటి వాళ్లకు తస్లీమా మాట మంట పుట్టించటం ఖాయం. మరి.. ఆయన ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/