Begin typing your search above and press return to search.

ఆనందిని రాహుల్ మాజీ ప్రియురాలు కొట్టిందా?

By:  Tupaki Desk   |   14 April 2016 8:48 AM GMT
ఆనందిని రాహుల్ మాజీ ప్రియురాలు కొట్టిందా?
X
చిన్నారి పెళ్లికూతురు ఆనంది ఫేం ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య వ్యవహారం దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో తెలిసిందే. ఆమె ఆత్మహత్య చేసుకుందన్న వాదన ఒకవైపు.. హత్య ఆరోపణలు మరోవైపు వినిపిస్తున్న వేళ.. ఈ కేసును అనుమానాస్పద మృతిగా పోలీసులు నమోదు చేశారు. ఈ కేసులో ప్రత్యూష మరణానికి కారణం.. ఆమె ప్రియుడు రాహుల్ అన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.

అదే సమయంలో.. రాహుల్ మాజీ ప్రియురాలు సలోనీ హస్తం ఉందన్న మాట వినిపించింది. అయితే.. దీనికి సంబంధించిన ఆధారాలు బయటపడలేదు. ఇదిలా ఉంటే.. ప్రత్యూషను తాను కొట్టినట్లుగా సలోనీ చెప్పటం సంచలనంగా మారింది. అయితే.. తాను కొట్టటానికి ముందు.. ప్రత్యూష తనను కొట్టిందంటూ ఆమె చెబుతోంది. దీనికి సంబంధించిన వివరాల్నివెల్లడిస్తూ.. ఫిబ్రవరి 11న తాను ప్రత్యూష ఇంటికి వెళ్లానని.. ఆ సమయంలో ఆమెతో పాటు.. రాహుల్ కూడా ఉన్నారని చెప్పింది.

తన దగ్గర తీసుకున్న డబ్బును తిరిగి ఇచ్చేయాలని కోరగా.. తమ మధ్య ఘర్షణ చోటు చేసుకుందని.. ఈ సందర్భంగా ప్రత్యూష తనను కొట్టిందని.. రాహుల్ కూడా కొట్టాడని.. ఆ తర్వాత కోపంతో తానూ ప్రత్యూషను కొట్టినట్లుగా పేర్కొంది. అనంతరం ప్రత్యూష.. రాహుల్ ఇద్దరి మీద కేసు పెట్టగా.. ఇద్దరూ వచ్చి ప్రాధేయడటంతో కేసును వాపసు తీసుకున్నట్లుగా వెల్లడించింది. సలోనీ దగ్గర ఎందుకు డబ్బులు తీసుకోవాల్సి వచ్చింది? తిరిగి ఇచ్చే విషయంలో ఎందుకు గొడవ జరిగిందన్నవిషయాలు ఎప్పటికి బయటకు వస్తాయో..?