Begin typing your search above and press return to search.

దక్కని టికెట్.. స్పందించిన దానం..

By:  Tupaki Desk   |   10 Sep 2018 10:19 AM GMT
దక్కని టికెట్.. స్పందించిన దానం..
X
తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. కొద్ది రోజుల క్రితమే టీఆర్ ఎస్ లో చేరిన మాజీ మంత్రి దానం నాగేందర్ కు ఈ మధ్య ప్రకటించిన టీఆర్ ఎస్ టికెట్ల జాబితాలో చోటు దక్కలేదు. ఆయనకు ఏ నియోజకవర్గం నుంచి టికెట్ ఇవ్వకపోవడంతో కొద్ దిరోజులుగా సైలెంట్ గా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పీసీసీ చీఫ్ ఉత్తమ్ ను ఓ స్టార్ హోటల్లో కలిసి చర్చలు జరిపినట్టు వార్తలు వెలువడ్డాయి. ఇవి వైరల్ గా మారడంతో దానం స్పందించారు.

పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని తాను కలవలేదని దానం నాగేందర్ సోమవారం విలేకరుల సమావేశంలో వివరణ ఇచ్చారు. తాను హోటల్ లో ఉత్తమ్ ను కలిసినట్టు వచ్చిన వార్తలను ఖండించారు. సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

టీఆర్ ఎస్ ప్రకటించిన 105 మంది జాబితాలో తన పేరు లేకపోవడంపై బాధగా ఏమీ లేదని దానం వివరణ ఇచ్చారు. అలా 105మంది అభ్యర్థులను ప్రకటించే దమ్ము ధైర్యం ఒక్క కేసీఆర్ కే ఉందన్నారు. తాను ఇప్పటికే 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని.. ఆ పదవిపై ప్రత్యేకమైన ఆసక్తి లేదని చెప్పారు. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కూడా అసంతృప్తి వస్తుందని దానం స్పష్టం చేశారు. తాను టీఆర్ ఎస్ లో చేరింది ఎలాంటి పదవులు ఆశించి కాదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ ఎస్ ఘనవిజయం సాధిస్తుందని చెప్పారు. కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని.. హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాకుండా ఓడిపోతుందని దానం జోస్యం చెప్పారు.