Begin typing your search above and press return to search.
మోడీని.. హిందువుల్ని పొగిడేసిన ట్రంప్
By: Tupaki Desk | 16 Oct 2016 9:27 AM GMTకంపు మాటలతో నిత్యం వివాదాల్లో ఇరుక్కొని మీడియాలో ప్రముఖంగా దర్శనమిచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ఆయన.. తాజాగా భారత ప్రధాని మోడీని.. భారత్ లో మెజార్టీ అయిన హిందువులను ఉద్దేశించి ఆయన పొగడ్తల వర్షం కురిపించే ప్రయత్నం చేశారు.
తన తాజా మాటలతో మోడీని.. భారత్ లోని హిందూ సమాజం మనసుల్ని దోచుకునే ప్రయత్నానికి తెర తీశారు. భారత్ తో పాటు హిందువులకు తాను పెద్ద అభిమానిగా చెప్పుకొచ్చారు. న్యూజెర్సీలో ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ సదస్సులో పాల్గొన్న ట్రంప్.. మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. తనను అధ్యక్షుడిగా ఎన్నుకుంటే భారత్ తో మంచి స్నేహ సంబందాలు కొనసాగుతాయని చెప్పిన ఆయన అమెరికా..భారత్ మధ్య బంధం మరింత బలోపేతం అవుతుందని వ్యాఖ్యానించారు.
భారత్ తో పాటు.. తాను హిందూ ప్రజలను గౌరవిస్తానని చెప్పిన ఆయన.. భారత్ ను అత్యంత వ్యూహాత్మక భాగస్వామిగా పేర్కొన్నారు. ఇరు దేశాలకుచక్కటి భవిష్యత్ ఉందన్న ఆయన.. తన చేతుల్లోకి అధికారం వస్తే.. తమ రెండు దేశాలు మరింత దగ్గర అవుతాయని వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ కు మంచి ప్రధాని ఉన్నారంటూ మోడీని పొగిడేశారు. మోడీపై తనకెంతో నమ్మకం ఉందని.. ఆర్థిక సంస్కరణల విషయంలో భారత్ ముందంజలో ఉందన్నఆయన.. భారత్ వృద్ధిరేటు బాగుందని.. ఆ స్థాయిలో అమెరికా వృద్ధి రేటు లేదని వ్యాఖ్యానించటం గమనార్హం. నిత్యం ఒళ్లు మండే వ్యాఖ్యలు చేసే ట్రంప్ తాజాగా చేసిన వ్యాఖ్యలు భారత్ లోని అత్యధికులు మనసుల్ని దోచుకుంటాయనటంలో సందేహం లేదు. కాకుంటే అదే పనిగా ‘హిందువులు’.. ‘హిందువులు’ అంటూ ట్రంప్ నోటి నుంచి వచ్చిన మాటను వినటం మాత్రం మా గొప్ప ఇబ్బందిగా అనిపించిందని చెప్పొచ్చు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/