Begin typing your search above and press return to search.
సెల్వం సంచలనం:మోడీ చెబితేనే..పళనితో కలిసా
By: Tupaki Desk | 17 Feb 2018 5:28 PM GMTఅన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తర్వాత చీలికలు పీలికలుగా మారిన అన్నాడీఎంకే గురించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. జయలలిత మరణం అనంతరం గ్రూపులుగా చీలిపోయిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కె పళనిస్వామి ఒకవర్గానికి నాయకత్వం - అన్నాడీఎంకె రెబల్ నేత - మాజీ సీఎం ఓ పన్నీర్ సెల్వం మరోవర్గానికి నాయకత్వం వహించారు. ఈ క్రమంలో రెండు వర్గాలు ఐక్యమత్యంతో పనిచేయాలని భావించి ఇందుకోసం తన వర్గం నేతలతో ఒక కమిటీని సెల్వం ఏర్పాటు చేశారు. ఏప్రిల్‌లో ఏర్పడిన ఈ కమిటీని రద్దుచేస్తున్నట్టు సెల్వం ప్రకటించారు. అనంతరం ఆయన మళ్లీ సీఎం పళనితో కలిసి... ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు ఓకే చెప్పేశారు.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి - దివంగత జయలలిత ఆప్తుడు అని పేరున్న ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ - ప్రధాని డైరెక్షన్ మేరకే సెల్వం అడుగులు ఉన్నాయని ఇన్నాళ్లు వినిపించన అంచనాలను నిజం చేస్తూ..ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. భారత ప్రధాని నరేంద్రమోడీ సూచన మేరకే ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామితో చేతులు కలిపానని తెలిపారు. శుక్రవారం థేనిలో అన్నాడీఎంకే పార్టీ సమావేశంలో ఆయన పలు కీలక విషయాలు వెల్లడించి సంచలనం సృష్టించారు.
అన్నాడీఎంకేలో పళనిస్వామి వర్గంతో కలిసేముందు తాను ప్రధాని నరేంద్రమోడీ దగ్గరకి వెళ్లి ఆయనతో సమావేశమయ్యానని పన్నీర్ సెల్వం తెలిపారు. `ఈ భేటీలో పార్టీకి సంబంధించిన పలు సమస్యలపై చర్చించాం. ప్రస్తుత పరిస్థితుల్లో మీరిద్దరు ఒకటై పార్టీని కాపాడుకోవాలని ఆయన తనకు సూచించారు` అని పార్టీ నేతలకు పన్నీర్ వివరించారు. `వాళ్లతో కలిసిపోయేందుకు నాకేం ఇబ్బందిలేదని, ఐతే ప్రభుత్వంలో మాత్రం మంత్రి పదవి చేపట్టనని మోడీకి చెప్పాను. లేదు, నీవు కచ్చితంగా మంత్రి వర్గంలో చేరాల్సిందే అని ప్రధాని మోడీ సూచించారు. ఆ కారణంతోనే నేను ఈరోజు మీ ముందు మంత్రిగా ఇక్కడ ఉన్నా `అని పన్నీర్ వెల్లడించాడు.
కాగా, ప్రధానితో భేటీ అనంతరం సైతం సెల్వం ఇవే మాటలు చెప్పారు. అన్నాడీఎంకే చీలిక విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం తన భావాలను తనతో పంచుకున్నారని సెల్వం వివరించారు. తాను ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సమయంలో ముక్కలైన పార్టీ వ్యవహారం ప్రస్తావనకు వచ్చిందని పేర్కొన్నారు. మళ్లీ అందరూ ఏకం కావాలని, ఒకే వేదికగా అన్నాడీఎంకే ముందుకు సాగాలని, అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని సూచించారని సెల్వం సదరు ఇంటర్వ్యూలో వివరించారు. అన్నాడీఎంకే ఒకే వేదికగా సాగాలని మోడీ ఆశ పడ్డారని, ఢిల్లీ నుంచి రాగానే విలీనం నినాదాన్ని తొలుత తానే అందుకున్నట్టు గుర్తు చేశారు. పార్టీ కార్యకర్తలు - ద్వితీయ శ్రేణి కార్యకర్తలు తన వైపు ఉన్నారని సెల్వం వెల్లడించారు.