Begin typing your search above and press return to search.

కరోనా అంటే భయం లేదు అంటున్న ‘బీజేపీ ఎంపీ’!?

By:  Tupaki Desk   |   13 April 2021 10:30 AM GMT
కరోనా అంటే భయం లేదు అంటున్న ‘బీజేపీ ఎంపీ’!?
X
గత తెలుగు దేశం పాలనలో ఆయన ప్రభుత్వంలో కీలకవ్యక్తి. ఏ కాంట్రాక్టు అయినా.. ప్రాజెక్టులు, ఫ్యాక్టరీలు అయినా ఆయన చేతిగుండానే పోయేవనే టాక్ ఉంది.. టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబుకు ఆర్థిక వెన్నుదన్నుగా నిలిచిన పెద్ద మనిషి సీఎం రమేశ్. కానీ ఇప్పుడు చంద్రబాబు ఓడిపోవడంతో ఆ లూప్ హోల్స్ బయటపడకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరిపోయారు. కర్రవిరగకుండా.. పాము చావకుండా రాజకీయాలు చేస్తున్నారు.

టీడీపీ నుంచి బీజేపీలోకి జంప్ అయిన రాజ్యసభ ఎంపీ సీఎం రమేశ్ తిరుపతి ప్రచార పర్వంపై తన మనోగతాన్ని వెల్లడించాడు. ఇక బీజేపీలో చేరినందుకు ఏదో జగన్ ను కామెంట్ చేయాలని.. లేకుంటే దెబ్బకొస్తది అని భావించి.. అలా పుండుకు యాంటిమెంట్ పూసి కారం చల్లినట్టుగా మాట్లాడేశారు.

తాజాగా బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి జగన్ భయపడే తిరుపతి సభను రద్దు చేసుకున్నారని’ ఆడిపోసుకున్నారు. కరోనా తీవ్రత అంతగా ఉంటే వాళ్ల మంత్రులు ఎందుకు తిరుగుతున్నారని ఎదురు ప్రశ్నించారు.. నిజంగా కరోనా ఉంటే మద్యం దుకాణాలను మూసివేయాలని సీఎం రమేష్ లాజిక్ వెలికితీశాడు.. తిరుపతికి వస్తే ప్రజలు ప్రశ్నిస్తారని భయపడే జగన్ తిరుపతి సభను వాయిదా వేసుకున్నారని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఆరోపించారు.

అయితే సీఎం రమేశ్ వ్యాఖ్యలు చూస్తే.. ఏదో బీజేపీలో ఉన్నందుకు కామెంట్ చేయాలని చేసినట్టు ఉంది కానీ.. నిజంగా జగన్ తిరుపతి సభ రద్దు చేసుకొని మంచి పనిచేశాడని లోలోపల సంతోషపడుతున్నట్టే కనిపిస్తోందట.. చాలా మంది జగన్ సభ రద్దు చేసుకొని మంచి పనిచేశాడని అందరూ మెచ్చుకుంటుంటే.. ఇలాంటి జపింగ్ ఎంపీ మాత్రం చేసిన పైపై కామెంట్స్ చూసి నవ్వు వస్తుందని అంటున్నారు.