Begin typing your search above and press return to search.
వైసీపీ సారధులు మహిళలే... ఐప్యాక్ సరికొత్త వ్యూహం...?
By: Tupaki Desk | 20 Aug 2022 3:30 AM GMTవైసీపీకి 2024 ఎన్నికల్లో మరోసారి విజయం తెచ్చిపెట్టడానికి ఐప్యాక్ సంస్థ సిద్ధమవుతోంది. ఈ మేరకు రాజకీయ వ్యూహకర్తగా ఆ సంస్థ కీలకమైన పాత్ర పోషిస్తోంది. అదే విధంగా హైదరాబాద్ లో ఆఫీ ని కూడా తీసుకుని సీరియస్ గా రంగంలోకి దిగిపోయింది. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ మళ్ళీ ఏపీలో యమ స్పీడ్ గా తిరగాలి అన్నదే ఐప్యాక్ రాజకీయ వ్యూహం.
దానికోసం గతంలో మాదిరిగానే సామాజిక మాధ్యమాలనే ఈసారి కూడా నమ్ముకుంటోంది. బాబు పోవాలి. జగన్ రావాలీ అంటూ నాడు అందమైన అర్ధవంతమైన నినాదాన్ని ఇచ్చి జగన్ని గెలిపించిన ప్రశాంత్ కిషోర్ కి చెందిన సంస్థనే ఐప్యాక్. ఈసారి ఐప్యాక్ ఏ రాజకీయ నినాదం అందుకుంటుందో తెలియదు కానీ దాన్ని జనాల్లోకి బహు చక్కగా తీసుకుపోవడానికి మాత్రం సారధులుగా మహిళలను ఎంచుకుంటోందని అంటున్నారు.
వారిని ముందు పెట్టి కధ నడపాలని చూస్తోందని అంటున్నారు. మహిళలు, గృహిణులు, ఒంటరి ఆడవారితో కొత్త రిక్రూట్మెంట్ స్ చేసుకోవడానికి ఐప్యాక్ అంతా సిద్ధం చేసింది అని అంటున్నారు.
మరి మహిళలే ఎందుకు అంటే వారికి ఏ పని అప్పగించినా వారు చిత్తశుద్ధితో చేస్తారు. అదే టైమ్ లో వారు చేసే పనిలో నాణ్యత కూడా ఉంటుంది. ఇక మహిళలకు అంటే వారికి డబ్బు అవసరాలు కూడా ఉంటాయి. సరిగ్గా ఈ పాయింట్ నే పట్టుకుని ప్రశాంత్ కిషోర్ మహిళా సారధులను సామాజిక మాధ్య వైసీపీ సారధులుగా రంగంలోకి తెస్తున్నారు అని అంటున్నారు.
అదే విధంగా చూస్తే ఈ మహిళలు ఏదైనా చెబితే జనాల బుర్రల్లోకి ఎక్కుతుంది అని కూడా ఊహిస్తున్నారు. సోషల్ మీడియాలో వీరు జగన్ సర్కార్ చేసే మంచి పనుల గురించి చెబుతారు. ప్రచారం చేస్తారు, అదే విధంగా ప్రతిపక్షం చేసే విమర్శలను కూడా ధీటుగా అక్కడ నుంచే తిప్పికొడతారు. దాంతో పాటు మహిళల పోస్టింగ్స్ అంటే కూడా ఆసక్తిగా చూస్తారు, చర్చలోకి కూడా వెళ్తాయి అన్న అసలైన స్ట్రాటజీ కూడా దీని వెనక ఉంది అంటున్నారు.
ఇక సోషల్ మీడియాలో వారిని ఉంచితే విపక్షాల వైపున ఎవరైనా టార్గెట్ చేసినా మహిళలకు ఉన్న చట్టాలు వెసులుబాట్లు వారికి ఉన్న హక్కులతో బయటపడవచ్చు అన్నదే అసలైన పక్కా వ్యూహం అంటున్నారు. అంటే ఈ మహిళలు సామాజిక మాధ్యమాలలో విపక్షాల మీద చెలరేగినా వారి మీద యాంటీగా విపక్షం ఏదైనా రివర్స్ అటాక్ చేసినా మహిళలను పట్టుకుని అలా అంటారా అంటూ రెచ్చిపోవచ్చు అన్న మాట. చట్టపరంగా వారికి రక్షణ ఆ విధంగా ఉంటుంది కాబట్టి అన్నీ ఆచీ తూచీ మరీ ఈ రకమైన సెలక్షన్ కి ప్రశాంత్ కిషోర్ పచ్చ జెండా ఊపారని అంటున్నారు. సో ఇక మీదట వైసీపీకి వారే అసలైన సారధులు అన్న మాట.