Begin typing your search above and press return to search.
ఐఫోన్ అసలు ధర రూ.15 వేలేనట
By: Tupaki Desk | 22 Sep 2016 2:33 PM GMTఐఫోన్. ఈ పేరు వింటే చాలు అది రిచ్ స్టేటస్‌కు సింబల్ అనే పేరు అందిరికీ కామన్ అయింది. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా పేరుగాంచింది. యాపిల్ ఐఫోన్ తొలి వెర్షన్ నుంచి ప్రస్తుతం విడుదలైన ఐఫోన్ 7 వరకు ఏ మోడల్ కూడా తక్కువ ధరకు లభించలేదు. తాజాగా విడుదల అయిన ఐఫోన్ 7 అయితే 60 వేలు పలుకుతోంది. ఇలా చాలా ఎక్కువ ధరే వెచ్చించి వినియోగదారులు కొనుగోలు చేయాల్సి వచ్చింది. అయితే ఇతర ఫోన్లతో పోలిస్తే సమర్థవంతమైన ఫీచర్లను కలిగి ఉండడం, ఎక్కడా డివైస్ హ్యాంగ్ కాకుండా స్మూత్‌గా రన్ అవడం, వేగంగా పనిచేసే హార్డ్‌వేర్, నాణ్యత కలిగిన కెమెరా వంటి అనేక సౌకర్యాలను అందిస్తుండడం చేత ఈ బ్రాండ్ అంతటి పాపులర్ అయిందని, అందుకే ఐఫోన్ల ధర అంత ఎక్కువగా ఉంటుందని ఎప్పటి నుంచో వాటిని వాడిన యూజర్లు, పలువురు టెక్ విశ్లేషకులు, నిపుణులు చెబుతూ వస్తున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా విడుదలైన ఐఫోన్ 7 కూడా అంతటి పవర్‌ఫుల్ ఫీచర్లతోనే యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. కానీ ఈ డివైస్ తయారీకి అసలు ఖర్చు ఎంతైందో తెలుసా..? కేవలం 15 వేలేనంట. దీన్ని ఓ సర్వే సంస్థ తేల్చింది మరి. ఐఫోన్ 7 కు చెందిన 32 జీబీ వేరియెంట్‌ను ఓ టెక్ సంస్థ సేకరించి దాన్ని పార్ట్‌లు పార్ట్‌లుగా విడదీసి అందులో ఉన్న హార్డ్‌వేర్‌ను పరిశీలించిందట. ఆయా హార్డ్‌వేర్ పరికరాలకు అసలు మార్కెట్‌లో ఎంత ధర ఉందో లెక్కిస్తూ ఐఫోన్ 7 తయారీకి ఎంత ఖర్చవుతుందో ఆ సంస్థ లెక్కించింది. ఈ క్రమంలో తయారీ ఖర్చుతో కలుపుకుని ఐఫోన్ 7 కు వాస్తవంగా 224.80 డాలర్లు ఖర్చయినట్టు నిర్దారించింది. అంటే ఐఫోన్ 7 తయారీకి మన కరెన్సీలో దాదాపుగా రూ.15వేలు ఖర్చయినట్టు లెక్క. కానీ అదే మోడల్‌ను మన దగ్గర విక్రయింబోతున్న వాస్తవ ధర రూ.60వేలు. దీన్ని బట్టి చూస్తేనే తెలుస్తుంది, యాపిల్ ఐఫోన్‌కు ఎంత ఎక్కువ ధర ఉంటుందో.