Begin typing your search above and press return to search.

ముంద‌స్తు గురించి మొద‌ట చెప్పిందే నేనే!!

By:  Tupaki Desk   |   10 Sep 2018 2:31 PM GMT
ముంద‌స్తు గురించి మొద‌ట చెప్పిందే నేనే!!
X
కొన్ని రోజులుగా ఉన్న రాజకీయ ఉత్కంఠకు తెరదించుతూ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మైన నేప‌థ్యంలో తెలంగాణలో ఎన్నికల సంగ్రామం మొదలైంది. టీఆర్ఎస్‌కు చెందిన 105 మంది అభ్యర్థుల పేర్లు గ‌త‌ గురువారం ప్రకటించి ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలకు శ్రీకారం చుట్టారు. దేశచరిత్రలో ఏనాడు లేనివిధంగా ఇంకా తొమ్మిది నెలల గడువు ఉన్నప్పటికీ ముందస్తు ఎన్నికలకు వెళ్లనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. కేబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ వెంటనే ఆమోదం తెలిపారు. ఎన్నికలు జరిగే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ కేసీఆర్‌ ను కోరారు. దీంతో ఒక్కసారిగా రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. దీంతో నవంబర్, డిసెంబర్ నెలల్లో శాసనసభకు ఎన్నికలు జరగటం దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది. అయితే ఈ క్రెడిట్‌ను త‌న సొంతం చేసుకునేందుకు కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలు రేణుకా చౌద‌రి ప్ర‌య‌త్నిస్తున్నారు.

అనూహ్య రీతిలో ముంద‌స్తు నిర్ణయం తీసుకున్న కేసీఆర్ విప‌క్షాల‌ను ఆశ్చ‌ర్యంలో ముంచెత్తిన సంగ‌తి తెలిసిందే. కేసీఆర్ ముంద‌స్తు గురించి తాను ఎప్పుడో చెప్పిన‌ట్లు రేణుక ఖ‌మ్మంలో మీడియాతో మాట్లాడుతూ వెల్ల‌డించారు. సంవత్సరం ముందే ముందస్తు ఎన్నికలు వస్తాయని తాను ఆన్‌ రికార్డు చెప్పానని ఆమె వివ‌రించారు. ముందుస్తు ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే సమాయత్తమై ఉందని వెల్ల‌డించారు. సరైన సమయంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు. టీడీపీ- కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకుంటాయని జరుగుతున్న ప్రచారంపై ప్రస్తావించగా ఆ ప్రచారం నిజమయ్యేవరకు తాను కామెంట్‌ చేయనని పేర్కొన్నారు.కాంగ్రెస్‌ పార్టీ తరఫున ప్రచారం, ఖమ్మం జిల్లా నుంచి అసెంబ్లీకి పోటీ చేయడం తదితర విషయాల్లో పార్టీ అధినాయకత్వం నిర్ణయం, ప్రజాభిప్రాయం ప్రకారం నడుచుకుంటానని చెప్పారు. కాగా, కేసీఆర్‌ అభ్యర్థులను ప్రకటించడంతో ఆ పార్టీలో రోజుకోక వ్యవహారం వెలుగుచూస్తోందని అసమ్మతిని ఉద్దేశించి ఆమె ఎద్దేవా చేశారు.

కాగా, ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరనే ఉత్కంఠకు అందరి కంటే ముందుగానే టీఆర్ఎస్ తెరదించిన‌ప్ప‌టికీ లుక‌లుక‌లు ఇంకా బ‌య‌ట‌ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడు స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి టిక్కెట్లను కేటాయించింది. మిగిలిన మూడు నియోజకవర్గాలకూ అభ్యర్థుల పేర్లను కేసీఆర్ ప్రకటించారు. ఖమ్మం జిల్లాలో పాలేరు నియోజకవర్గం నుంచి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం పువ్వాడ అజయ్‌ కుమార్ - వైరా బానోతు మదన్‌లాల్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఖరారు కాగా.. మధిర లింగాల కమల్‌ రాజు - సత్తుపల్లి పిడమర్తి రవికుమార్ పేర్లు జాబితాలో ఉన్నాయి.