Begin typing your search above and press return to search.

‘పెద్ద నోట్ల’పై ఐటీశాఖ ఫస్ట్ నోటీస్ ఇచ్చేసింది

By:  Tupaki Desk   |   19 Nov 2016 6:13 AM GMT
‘పెద్ద నోట్ల’పై ఐటీశాఖ ఫస్ట్ నోటీస్ ఇచ్చేసింది
X
మోడీ చెప్పే మాటలు ఎంత సీరియస్ గా ఉంటాయన్న విషయాన్ని తేల్చి చెప్పే ఉదంతమిది. ఆయన కానీ ఏదైనా విషయంపై ఒకసారి ఫిక్స్ అయితే.. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందన్న చందంగానే ప్రధాని తీరు ఉంటుందని చెప్పాలి. నోట్ల రద్దుకు సంబంధించిన చేసిన ప్రకటన సందర్భంగా ప్రధాని కొన్ని అంశాల్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. బ్యాంకు ఖాతాల్లో రూ.2.5లక్షల మొత్తాన్ని మాత్రమే డిపాజిట్ చేసేందుకు అనుమతి ఉందని.. ఒకవేళ అంతకు మించిన మొత్తాన్ని కానీ డిపాజిట్ చేసే ఆ మొత్తానికి సంబంధించిన వివరాల్ని.. పత్రాల్ని సమర్పించాల్సిందిగా చెప్పారు. ఒకవేళ రూ.2.5లక్షలకు మించిన మొత్తానికి సరైన డాక్యుమెంట్లు సమర్పించని పక్షంలో వారికి నోటీసులు అందుతాయని హెచ్చరించారు.

అయితే.. ఈ విషయాన్ని చాలామంది లైట్ తీసుకున్నారు. అయితే.. అలాంటి తేలిక భావంతో ఉంటే దొరికిపోతారన్న విషయం తాజాగా తేలిపోయింది. సిక్కింలోని గాంగ్ టక్ కు చెందిన సీతారాం ఎంటర్ ప్రైజస్ సంస్థ తమ ఖాతాల్లో డిపాజిట్ చేసిన రూ.4.51లక్షలకు సంబంధించిన లెక్క గురించి ఐటీశాఖ ఆరా తీస్తూ నోటీసులు పంపింది.

దీంతో.. పెద్దనోట్ల రద్దు తర్వాత.. ఆ అంశానికి సంబంధించిన మార్గదర్శకాలను అతిక్రమించిన వారికి ఇచ్చిన మొదటి నోటీసుగా తాజా ఉదంతాన్ని చెప్పాలి. ఎవరికి వారు తమ ఖాతాల్లో ఇష్టారాజ్యంగా మొత్తాన్ని డిపాజిట్ చేస్తే.. ఐటీ శాఖ చూస్తూ ఊరుకోదని.. లెక్కల్లో తేడా వస్తే.. దానికి సంబంధించిన వివరణ ఇవ్వాల్సి ఉంటుందన్న విషయం తాజాగా తేలినట్లైంది.

తాజా ఉదంతంలోకి వెళితే.. సిక్కింలోని సీతారాం ఎంటర్ ప్రైజస్ సంస్థ ఈ నెల 13న రూ.4.51 లక్షల్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ సిక్కిం శాఖలో డిపాజిట్ చేసింది. ఈ మొత్తానికి సంబంధించిన ఆర్థిక వనరులు ఎక్కడివో చెప్పాలని చెప్పటమే కాదు.. గడిచిన రెండేళ్లుగా రిటర్న్స్ కు సంబంధించిన పత్రాల్ని కూడా జత చేయాలని ఆదేశించటం గమనార్హం. తాజా ఉదంతం చెప్పేదేమంటే.. దేశ వ్యాప్తంగా బ్యాంకుల్లో డిపాజిట్ చేసే వారికి సంబంధించిన అన్నీ ఖాతాల్ని ఐటీ శాఖ డేగ కన్నుతో చూస్తుందని చెప్పొచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/