Begin typing your search above and press return to search.
శరత్ కుమార్.. రాధిక అడ్డంగా బుక్ అయ్యారా?
By: Tupaki Desk | 12 April 2017 4:49 PM GMTతమిళ సినీ ప్రముఖుడు శరత్ కుమార్.. ఆయన సతీమణి సీనియర్ నటీమణి రాధికలు అడ్డంగా బుక్ అయ్యారా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రవ్నగా మారింది. అమ్మ మరణంతో జరగాల్సిన ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో ఇష్టారాజ్యంగా డబ్బు వ్యవహారం తెర మీదకు రావటం.. ఉప ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే.
ఎన్నికల్లో ఓటర్లను మభ్య పెట్టేందుకు దాదాపుగా రూ.89 కోట్ల మొత్తాన్ని కమిటీలు వేసుకొని మరీ సెట్ చేసిన తమిళనాడు అధికారపక్షం వేసిన స్కెచ్ ను ఐటీ అధికారులు రంగంలోకి దిగటంతో గుట్టు రట్టైంది. ఈ కుట్రకు సంబంధించిన అంశాలన్నీ బయటకు వచ్చాయి. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి మొదలుకొని.. పలువురు మంత్రులు బుక్ అయ్యారు. వీరు సరిపోనట్లుగా.. ఈ ఉప ఎన్నికలో చిన్నమ్మ వర్గానికి తన పూర్తి మద్దతు ప్రకటించిన సినీ నటుడు శరత్ కుమార్ కూడా దొరికిపోవటం సంచలనంగా మారింది.
ఇప్పటికే ఐటీ అధికారులు ఆయన్ను ప్రశ్నించారు. తాజాగా.. వారి కుటుంబానికి చెందిన రాడాన్ గ్రూప్ కార్యాలయంలోనూ ఐటీ సోదాలు నిర్వహించింది. ఇప్పటికే శరత్ కుమార్.. ఆయన సన్నిహితుల ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించిన ఐటీ అధికారులు పలు పత్రాలు.. ఆధారాల్ని సేకరించినట్లుగా ప్రచారం సాగుతోంది. రాడాన్ కార్యాలయంలో నిర్వహించిన తనిఖీల్లో హార్డ్ డిస్క్‌లనుస్వాధీనం చేసుకున్నారు.
ఈ ఉదంతానికి సంబంధించి ఐటీ శాఖ ఇచ్చిన నోటీసుల నేపథ్యంలో ఐటీ అధికారుల ఎదుట.. శరత్ కుమార్.. రాధికలు హాజరయ్యారు. ఓటర్లకు డబ్బును పంపిణీ చేసేందుకు రాడాన్ కంపెనీకి చెందిన నగదును వినియోగించినట్లుగా అనుమానిస్తున్నారు. ఈ ఉదంతానికి సంబంధించి తాజాగా ఎంజీఆర్ వర్సిటీ వీసీ డాక్టర్ గీతా లక్ష్మి ఐటీ అధికారుల విచారణకు హాజరు కావటం గమనార్హం.
ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టటానికి అధికారపక్షం రూ.89 కోట్ల మొత్తాన్ని ఉపయోగించినట్లుగా ఐటీ శాఖ ఆధారాలతో నిరూపించటంతో.. కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రలోభాల పర్వంలో ముఖ్యమంత్రి పళని స్వామి హస్తం ఉందన్న విషయం నిరూపితం కావటంతో.. ఆయనకు కష్టకాలం మొదలైనట్లేనని చెబుతున్నారు.
ఓటర్లనుప్రలోభ పెట్టే విషయంలో అధికారపక్షం అడ్డంగా బుక్ అయిన నేపథ్యంలో.. తమిళనాడు రాష్ట్ర సర్కారును రద్దు చేయాల్సిందిగా విపక్ష డీఎంకే డిమాండ్ చేస్తోంది. తాజాగా ముంబయికి వెళ్లిన డీఎంకే నేతలు.. గవర్నర్ విద్యాసాగర్‌ను కలిసి.. ప్రస్తుత పరిణామాల్ని వివరించి.. తమిళనాడు ప్రభుత్వాన్ని రద్దు చేయాల్సిందిగా కోరారు. అంతేకాదు.. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో కోట్లు కుమ్మరించిన నేతలపై జీవితకాలం నిషేధం విధించాల్సిందిగా డిమాండ్ చేయటం గమనార్హం. మొత్తంగా ఈ వ్యవహారం తమిళనాడు అధికారపక్షానికే కాదు.. శరత్ కుమార్.. రాధికలకు కూడా కొత్త కష్టాల్ని తెచ్చిందనటంలో సందేహం లేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/