Begin typing your search above and press return to search.
‘కొత్త’ నల్లధనం మొదలైపోయింది
By: Tupaki Desk | 2 Dec 2016 8:17 AM GMTదేశవ్యాప్తంగా ప్రజలు నగదు కోసం నానా పాట్లు పడుతున్న తరుణంలో సంపన్నులకు మాత్రం కొత్త నోట్లు ఇంటికే చేరిపోతు న్నాయి. తాజాగా గురువారం ఈడీ జరిపిన సోదాల్లో అధికారుల కళ్లు చెదిరిపోయేలా రూ. 5 కోట్ల కొత్త కరెన్సీ బయటపడింది. ఐటీ శాఖ బెంగుళూరులో జరిపిన సోదాల్లో ఇద్దరు ప్రభుత్వ ఇంజనీర్ల వద్ద ఈ నగదు బయటపడినట్లు అధికారులు ప్రకటించారు. కొత్తనోట్లు భారీగా దొరుకుతుండడంతో నల్లధనం కొత్త నోట్ల రూపంలోకి మారుతోందని ఇట్టే అర్థమవుతోంది.
ఈ సోదాల్లో మొత్తం రూ. 6 కోట్లు స్వాధీనం చేసుకోగా అందులో రూ.5 కోట్ల విలువైన రూ.2000 నోట్లున్నాయి. నోట్ల రద్దు తరువాత ఇంత పెద్ద మొత్తంలో కరెన్సీని స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారి. కాగా ఇంత పెద్ద మొత్తంలో వారికి ఈ డబ్బు చేరడానికి ఖచ్చితంగా బ్యాంకు అధికారులు సహాయం చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.
కాగా సోదాల్లో ఈ నోట్లతో పాటు కొన్ని బంగారు బిస్కట్లు, విలాసవంతమైన కార్లు దొరికినట్లు తెలుస్తోంది. బెంగళూరులో మరిన్ని సోదాలు - దాడులు జరపడానికి ఐటీ అధికారులు రెడీ అవుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/