Begin typing your search above and press return to search.
మూడు సార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా!
By: Tupaki Desk | 4 May 2020 1:30 AM GMTటీం ఇండియా స్టార్ ఫేస్ బౌలర్ మహ్మద్ షమీ కెరీర్ పరంగా మరియు వ్యక్తిగత జీవితం పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అప్పుడప్పుడే టీం ఇండియా జట్టులో ఆడుతున్న సమయంలో అనూహ్యంగా ఆయన భార్య మీడియా ముందుకు వచ్చి సంచలన ఆరోపణలు చేసింది. అదే సమయంలో షమీ సోదరుడిపై గృహ హింస కేసును కూడా పెట్టింది. సోషల్ మీడియా ద్వారా షమీపై తీవ్రమైన విమర్శలు చేయడంతో పాటు ఆయన కెరీర్ నే దెబ్బ కొట్టేలా ప్రయత్నించిందట. తాజాగా ఆ విషయాలపై షమీ ఇన్ స్టాగ్రామ్ లైవ్ లో షమీ మాట్లాడాడు.
రోహిత్ శర్మతో కలిసి ఇన్ స్టాలో ఫ్యాన్స్ తో ఇంట్రాక్ట్ అయిన షమీ తన పాత చేదు జ్ఞాపకాలను నెమరేసుకున్నాడు. తన భార్య గతంలో తనపై చేసిన ఆరోపణల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అదే సమయంలో యాక్సిడెంట్ అవ్వడంతో క్రికెట్ కు దూరం అయ్యాను. జీవితం మొత్తం చీకటి అయినట్లుగా అనిపించింది. ఏం చేయాలో పాలుపోక ఆత్మహత్య ఆలోచన కూడా చేశాను. నా జీవితం పూర్తి అయ్యిందనే ఆలోచన అప్పట్లో నాకు కలిగింది.
మేము అపార్ట్ మెంట్ లో 24వ ఫ్లోర్ లో ఉండేవాళ్లం. అక్కడ నుండి దూకేయాలనిపించేది. నా కుటుంబ సభ్యులు నా గురించి చాలా భయపడ్డారు. నా సోదరుడు ఎప్పుడు నాతోనే ఉండి నన్ను మోటివేట్ చేసేవాడు. అమ్మా నాన్న కూడా నన్ను మామూలు మనిషిని చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. వాళ్లు చెబుతున్నది నా గురించే అనే ఉద్దేశ్యంతో మళ్లీ క్రికెట్ మొదలు పెట్టాను అన్నాడు. ఆ సమయంలో నా కుటుంబ సభ్యుల మద్దతు లేకుంటే నేను ఆత్మహత్య చేసుకునే వాడినే అన్నాడు.