Begin typing your search above and press return to search.
ఆర్థిక ప్యాకేజీ గురించి మోడీకి నేనే చెప్పా!
By: Tupaki Desk | 13 May 2020 5:00 AM GMTటీడీపీ నేతల మాటలు కోటలు దాటుతాయి.. కానీ పనిమాత్రం పైసా కాదనే సామెత రాజకీయ వర్గాల్లో ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు గారు అంతే.. హైటెక్ సీఎంగా.. మీడియా మేనేజ్ మెంట్ కింగ్ గా.. ఆయన దగ్గినా.. తుమ్మినా.. ఏదైనా వార్త అయిపోతుంది. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లను ఇంజినీరింగ్ చేయమంది మన బాబు గారే.. హైదరాబాద్ కట్టింది బాబుగారే.. ఇలా ఒక్కటేమిటీ బాబు గారి కోతలు రాజకీయాల్లో చాలానే వినిపించాయి.
చంద్రబాబుతో సాన్నిహిత్యమో..లేక ఆ పార్టీతో అంటకాగడమో ఏమో కానీ టీడీపీ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కూడా ఇప్పుడు నాలుగు ఆకులు ఎక్కువే చదివారు.
ప్రధాని నరేంద్రమోడీ నిన్న ప్రకటించిన 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. ఆర్థిక ప్యాకేజీని పారిశ్రామికవేత్తలు కూడా స్వాగతిస్తున్నారు.ఈ క్రమంలోనే టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కూడా ఈ 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ పై హర్షం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే గల్లా జయదేవ్ వరుస ట్వీట్లు చేశారు. లాక్ డౌన్ తో దేశవ్యాప్తంగా వ్యవసాయం, పారిశ్రామిక రంగాలు కుదేలయ్యాయని.. వాటిని పునరుజ్జీవింప చేయడానికి 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించాలని తాను ఏప్రిల్ లో ఎంపీలతో మోడీని నిర్వహించిన ఓ సమావేశంలో గుర్తు చేశానని గల్లా తెలిపారు. ఇలా ఈ భారీ ఆర్థిక ప్యాకేజీ క్రెడిట్ ను గల్లా జయదేవ్ తన ఖాతాలో వేసుకున్నారు.
దేశానికి ప్రధాన మంత్రి అందరి అభిప్రాయాలు తీసుకొని.. నిపుణులను సంప్రదించి ఈ ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తే ఒక్క ట్వీట్ తో గల్లా మొత్తం క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. అయినా చంద్రబాబు ఏక్ నంబర్ అయితే ఆయన ఎంపీ దస్ నంబర్ అవుతారా అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.