Begin typing your search above and press return to search.
చంపేయాలని పాక్ సైనికులను కోరిన సైనికుడు
By: Tupaki Desk | 25 March 2017 4:29 PM GMTపాకిస్తాన్ సైనికుల ఆకృత్యాలు ఏ విధంగా ఉంటాయో తెలియజెప్పేందుకు ఇదో ఉదాహరణ. దురదృష్టవశాత్తు నియంత్రంణ రేఖ దాటిన ఓ భారతీయుడు పొరుగుదేశం సైనికుల చేతుల్లో అష్టకష్టాలు పడ్డాడు. ఆ చిత్రహింసలకు తట్టుకోలేక తనను చంపేయమని వేడుకున్నాడు. ఇలా ఇబ్బందులు పడ్డ భారత సైనికుడి పేరు చందూ బాబూలాల్ చవాన్. ఉరిలోని భారత సైనిక శిబిరంపై ఉగ్రవాదులు దాడి చేసిన తర్వాత, గతేడాది సెప్టెంబర్ 29న భారత సైనికులు నియంత్రణ రేఖ అవతల ఉన్న ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన సంగతి తెలిసిందే. జమ్ము కశ్మీర్ లోని పూంచ్ సెక్టార్ లో నియంత్రణ రేఖ వద్ద చవాన్ విధులు నిర్వహిస్తున్న 22 ఏళ్ల చవాన్ అనుకోకుండా అదే రోజు నియంత్రణ రేఖ దాటి పాక్ భూభాగంలోకి వెళ్లారు. పాకిస్థాన్ సైనికులు ఆయన్ను పట్టుకుని బందించారు.
ఇలా పొరుగుదేశం సైనికులకు చిక్కిన చవాన్ నాలుగు నెలల తర్వాత జనవరి 21న పాక్ సైనికుల నుంచి విముక్తుడయ్యాడు. పాక్ సైనికుల కస్టడీలో అనుభవించిన కష్టాలను చవాన్ తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో తను అనుభవించిన నరకాన్ని వెల్లడించారు. తను పాక్ సైనికులకు చిక్కిన తర్వాత వారు తనిఖీ చేసి దుస్తులతో సహా అన్నీ లాక్కున్నారని చవాన్ తెలిపాడు. 'పాకిస్తాన్ సైనికులకు చిక్కినప్పటి నుంచి నాకు నరకం లాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. నాపై నల్లటి దుస్తులు వేసి, ఓ వాహనంలో తీసుకెళ్లారు. ఓ చీకటి గదిలో నన్ను బంధించారు. బాత్ రూమ్ - టాయ్‌లెట్ కూడా అదే గదిలో ఉన్నాయి. నాకు ఇంజెక్షన్లు వేసి - కొట్టేవారు. చెవిలో డ్రాప్స్ వేయడంతో రక్తం వచ్చేది. ఏం చేయాలో అర్థంకాలేదు. తల బాదుకునేవాణ్ని. సమయం మారుతుంది కానీ అది రాత్రా పగలా అన్న విషయం కూడా తెలిసేది కాదు. ఆ సమయంలో నా కుటుంబం గుర్తుకు వచ్చి దుఃఖం వచ్చేది. ఈ వేదనలో నుంచి నన్ను చంపేయమని పాకిస్తాన్ సైనికులను కూడా కోరాను. నాకు చావు ప్రసాదించమని దేవుణ్ని కోరుకునేవాణ్ని' అని ఆవేదన భరితంగా తాను అనుభవించిన పరిస్థితులను చవాన్ పంచుకున్నాడు
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/