Begin typing your search above and press return to search.
సినీనటిపై కారు డ్రైవర్ అత్యాచారయత్నం
By: Tupaki Desk | 5 March 2016 7:51 AM GMTఉబర్...ఢిల్లీలో సంచలనం సృష్టించిన నిర్బయ ఘటన సందర్భంగా బాగా పాపులర్ అయిన క్యాబ్ కంపెనీ. ఉబర్ డ్రైవర్ అమానుషంగా జరిపిన అత్యాచారం ఘటనతో మహిళల హక్కులు - భద్రతపై పెద్ద ఎత్తున్నే చర్చ సాగింది. తాజాగా అదే ఉబర్‌కు చెందిన కారు, అలాంటి రేప్ కథతో మరో సంఘటన వెలుగులోకి వచ్చింది.
ప్రముఖ హాలీవుడ్ టీవీ నటి ఫర్హా అబ్రహం ఈ సంఘటనలో బలికాబోయిన మహిళ. టీన్ మామ్ అనే సీరియల్ తో పాపులరైన ఈ రియాల్టీ షో నటి ఉబర్ క్యాబ్ డ్రైవర్ ఒకరు తనపై రేప్ చేసేందుకు ప్రయత్నం చేయబోయాడని వెల్లడించింది. ఇటీవల ఓ రోజు అర్ధరాత్రి ప్రయాణం చేసేందుకు ఉబర్ క్యాబ్ ను బుక్ చేసుకుంది. ఈ ప్రయాణంలో ట్యాకీ డ్రైవర్ ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడట. ఈ క్రమంలో ఫర్హా అలర్ట్ అయి తన బాయ్ ఫ్రెండ్ సిమన్ కు సమాచారం ఇచ్చింది. వెంటనే అక్కడికి చేరుకున్న సిమన్ అక్కడికి చేరుకొని కారు అద్దాలు పగులగొట్టి ఆమెను డ్రైవర్ నుంచి కాపాడారట. తన బాయ్ ఫ్రెండ్ రాకుంటే ఘోరం జరిగిపోయేదని ఫర్హా ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ రేప్ సంఘటన ఎంత షాక్ కలిగించిందో మరో సంఘటన అంతే ఇబ్బంది పెట్టిందని ఫర్హా వెల్లడించింది. డ్రైవర్ అఘాయిత్యాన్ని పోలీసులకు తెలపగా వారు సంఘటన స్థలానికి వచ్చారని, అయితే సదరు డ్రైవర్ అప్పుడు కూడా తనపట్ల ఇబ్బందిగా ప్రవర్తిస్తున్నా పోలీసులు కిమ్మనకుండా ఉండిపోయారని మండిపడింది. పోలీసులంటే ఇలాగే ఉంటారనే భావనకు తాను వచ్చేశానని ఫర్హా చెప్పేసింది. అంతేకాదు ఈ డ్రైవర్ చేసిన పాడు పని వల్ల ఇక భవిష్యత్ లో ఉబర్ క్యాబ్ మొహం చూడొద్దని డిసైడ్ అయినట్లు ఆమె వివరించింది.