Begin typing your search above and press return to search.
మన జవాన్లను పొట్టన పెట్టుకున్నోడి డిటైల్స్!
By: Tupaki Desk | 15 Feb 2019 5:23 AM GMTభయానకం అన్న మాట అక్కడి పరిస్థితిని చూసినప్పుడు చిన్నబోతుంది. దేశ చరిత్రలో ఇప్పటివరకూ ఎప్పుడూ లేని విధంగా సైనికుల మీద జరిగిన ఉగ్రదాడిలో పెద్ద సంఖ్యలో సైనికులు మృత్యువాత పడ్డారు. దాదాపు 350 కేజీల పేలుడు పదార్థాలతో ఉన్న వాహనాన్ని.. జవాన్లు ప్రయాణిస్తున్న ట్రక్కును బలంగా గుద్దటం ద్వారా భారీ విధ్వంసాన్ని సృష్టించారు.
దీంతో నలభైకి పైగా జవాన్లు వీర మరణం పొందారు. ఈ అకృత్యానికి పాల్పడిన సూసైడ్ బాంబర్ తన వీడియో సందేశాన్ని ఉంచాడు. తానెవరన్న విషయాన్ని వెల్లడించారు. తానెందుకు ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడో చెప్పుకొచ్చాడు.
జమ్ముకాశ్మీర్ లోని పుల్వామాలో జవాన్లను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు జరిపిన దాడి గురించి తెలిసిందే. ఈ దాడిలో మృతుల సంఖ్య 40కు పైనే ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఉగ్రదాడికి పాల్పడింది జైష్ ఏ మొహమ్మద్ తీవ్రవాది ఆదిల్ అహ్మద్ ధఱ్ గా గుర్తించారు. ఇతనికి ఆదిల్ ఆహ్మద్ గాడీ టక్రానేవాలా గుండీబాగ్ వకాస్ కమాండో అని కూడా పిలుస్తారని చెబుతున్నారు. తాజా దాడిలో తొలుత ఉగ్రవాదులు ఐఈడీ పేలుడుకు పాల్పడి.. ఆ తర్వాత కాల్పులకు తెగబడ్డారు.
సీఆర్ఫీఎఫ్ కాన్వాయ్ రాగానే ఉగ్రవాదులు కారు బాంబు పేల్చారు. ఈ పేలుడు కోసం 350 కేజీల పేలుడు పదార్థాన్ని వినియోగించారు. ఈ భారీ పేలుడు పదార్థాన్ని స్కార్ఫియో వాహనంలో ఉంచి.. జవాన్లతో వెళుతున్న బస్సును ఢీకొట్టటం ద్వారా భారీ మారణహోమాన్ని సృష్టించారు.
తన పాశవిక చర్యకు కాస్త ముందుగా ఒక వీడియో సందేశాన్ని ఇచ్చిన ఈ తీవ్రవాది.. అందులో మీరీ వీడియో చూసేసరికి నేను స్వర్గంలో ఉంటానని పేర్కొన్నారు. వీడియోలో జెష్ ఏ మొహమ్మద్ జెండా ముందు ఆదిల్ ఆటోమెటిక్ రెఫిల్ ను తగిలించుకొని కనిపించాడు. తమ మిలిటెంట్ కమాండర్లను కొద్దిమందిని చంపినంత మాత్రాన తాము బలహీనపడిపోతామని అనుకోవద్దని పేర్కొన్నాడు. పుల్వామా ప్రాంతానికి చెందిన ఆదిల్ 2016 మార్చి 19 నుంచి కనిపించకుండా పోయాడని తేల్చారు. అతనితో పాటు మరో ఇద్దరు కూడా కనిపించటం లేదని స్థానికులు చెబుతున్నారు.