Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ కు జంపింగ్ జాపాంగ్ టెన్షన్

By:  Tupaki Desk   |   4 May 2019 5:00 AM GMT
కాంగ్రెస్ కు జంపింగ్ జాపాంగ్ టెన్షన్
X
కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తెలంగాణలో అల్లకల్లోలంగా మారింది. మొన్నటి ఎన్నికల్లో గెలిచిన 19మందిలో 11మంది కారెక్కేశారు. మరో ఇద్దరినీ కూడా లాగేసి కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని టీఆర్ ఎస్ లో విలీనం చేయాలని కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. దీంతో కాంగ్రెస్ నేతల్లో ఫస్ట్రేషన్ పెరిగిపోతోంది.

ప్రస్తుతం తెలంగాణలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ నేతలు గ్రామాలు, మండలాల్లో నేతలకు పార్టీ బీఫాంలు అందజేస్తున్నారు. ఈ కోవలోనే కాంగ్రెస్ బీఫాం మీద గెలిచి ఇతర పార్టీలోకి వెళితే చెప్పుతో కొడతామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించడం దుమారం రేపింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తాను ఈ మాట అంటున్నానని పొన్నం వివరించాడు.

అయితే పొన్నం ఇలా అనడానికి కారణముంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. అయితే అప్పటి ప్రచారంలో ప్రజలు గెలిచాక మళ్లీ టీఆర్ ఎస్ లోనే చేరుతావు కదా అని ప్రశ్నించారు. దీంతో పొన్నం ఓ అఫిడవిట్ రాసి.. తాను గెలిస్తే పార్టీ మారనని.. ఒకవేళ మారితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రజలకు విడుదల చేశారు. లోక్ సత్తా, ప్రజా, స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చాడు. అలా తాను పార్టీ మారనని ఏకంగా అఫిడవిట్ ఇచ్చిన పొన్నం కింది స్తాయి నేతలు కూడా మారద్దు అనే ఇలా ఫైర్ అయినట్టు తెలిసింది.