Begin typing your search above and press return to search.

ద‌టీజ్ చంద్ర‌బాబు... తెలంగాణ‌లోనే కాదు అమెరికాలోనూ రాజ‌కీయం చేస్తా

By:  Tupaki Desk   |   24 Dec 2022 11:38 AM GMT
ద‌టీజ్ చంద్ర‌బాబు... తెలంగాణ‌లోనే కాదు అమెరికాలోనూ రాజ‌కీయం చేస్తా
X
రాజ‌కీయాల్లో చంద్ర‌బాబు చాణ‌క్యం గురించి తెలియ‌ని వారుండ‌రు. రాజ‌కీయ వ్యూహ ప్ర‌తివ్యూహాల్లో ఆరితేరిన ఆయ‌న‌కు రాజ‌కీయాలు న‌ర‌న‌రాల‌న జీర్ణించుకుపోయాయి. టెక్నాలీజీలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకు పోవ‌డంలో ఒక సీఎంగా కాకుండా ఒక సీఈఓలాగా వ్య‌వ‌హ‌రించి పాల‌నాద‌క్షుడిగా పేరుగ‌డించిన చంద్ర‌బాబు రాజ‌కీయాల్లో విల‌క్ష‌ణ వ్య‌క్తి. ఆయ‌న తాజాగా తాను అవ‌స‌ర‌మైతే అమెరికాలోనూ రాజ‌కీయాలు చేస్తాన‌ని చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వైర‌ల్‌గా మారాయి.

ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌టంతో ఏపీలో రాజ‌కీయ నేత‌ల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. టీడీపీ, వైసీపీ, జ‌న‌సేన పార్టీల అధినేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం ఖండాంత‌రాల‌ను దాటిపోతోంది. క‌డ‌ప జిల్లా క‌మాల‌పురంలో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.జ‌గ‌న్ మాట్లాడుతూ అటు చంద్ర‌బాబు ఇటు ప‌న‌వ్ క‌ల్యాణ్‌పైన ఒక రేంజ్‌లో విర‌మ్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు. చంద్ర‌బాబులాగా నేను అవ‌స‌రాన్ని బ‌ట్టి రాష్ట్రాల‌ను మార్చ‌ను, ద‌త్త‌పుత్రుడిలాగా ఆ భార్య కాదంటే మ‌రో భార్య అంటూ మార్చ‌న‌ని జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లు తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయ ధుమారం సృష్టించాయి.

జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌కు టీడీపీ అధినేత చంద్ర‌బాబు అంతే స్థాయిలో స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. విజ‌య‌న‌గ‌రంలో జరిగిన బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ జ‌గ‌న్‌పై ఎదురు దాడి చేశారు. తెలుగు వాళ్లు ఎక్క‌డుంటే అక్క‌డ రాజ‌కీయం చేస్తాన‌ని, త‌న‌ను ఎవ‌రు ఆపుతారో చూస్తాన‌ని జ‌గ‌న్‌కు స‌వాల్ విసిరారు. తెలంగాణ‌లో త‌న‌కు రాజ‌కీయం కొత్త కాద‌ని, తాను ఎక్క‌డున్నా అభిమానించే తెలుగువారు ఉన్నార‌న్నారు. నేను ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రాజ‌కీయాలు చేస్తుంటే కొంద‌రు వ‌ణికిపోతున్నార‌ని సీఎం జ‌గ‌న్‌పై ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు గుప్పించారు.

తెలుగువారు ఎక్క‌డ ఉంటే నేను అక్క‌డ ఉంటా, అతి తెలంగాణ అయినా, అమెరికా అయినా, ఎక్క‌డైనా స‌రే తెలుగువారి కోసం రాజ‌కీయంగా అండ‌గా ఉంటాను. తెలుగు వారి కోస‌మే పుట్టిన పార్టీ తెలుగుదేశం. దీనిపైన కొంద‌రు రాజ‌కీయాలు చేస్తున్నారు, అయినా న‌న్నెవ‌రూ అప‌లేరు అని ఆయ‌న ఘాటుగా స్పందించారు.

జ‌గ‌న్ విమ‌ర్శ‌ల‌కు చంద్ర‌బాబు ఇచ్చిన కౌంట‌ర్ వైర‌ల్‌గా మారింది. మ‌రి జ‌గ‌న్ చేసిన విమ‌ర్శ‌ల‌కు జ‌న‌సేనాని ఏ విధంగా స్పందిస్తాడ‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.