Begin typing your search above and press return to search.
రజినీ పార్టీ.. జీవితకాలం లేటేనా?
By: Tupaki Desk | 12 March 2020 6:24 AM GMTతమిళనాట సూపర్ స్టార్ రజినీకాంత్ పార్టీ పెడుతాడా లేదా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ ప్రశ్న. ఆయన పార్టీ కోసం కళ్లు కాయలు కాసి పండ్లు అయ్యేలా కార్యకర్తలు, నేతలు, అభిమానులు ఎదురుచూస్తున్నారు.అయితే తమిళనాడులో ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే సమయం ఉన్నా రజినీకాంత్ మాత్రం మౌనం వీడడం లేదు. పార్టీ ఏర్పాటుపై స్పష్టత ఇవ్వడం లేదు.
గురువారం చెన్నైలో రజినీ మక్కల్ మండ్రమ్ ఆఫీస్ బేరర్లతో రజినీకాంత్ సమావేశమయ్యారు. కానీ ఈ సమావేశం అనంతరం పార్టీ పేరు, ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తారనే విషయాలను మాత్రం రజినీ చెప్పకుండా సస్పెన్స్ లో పెట్టారు.
రాజకీయాల్లోకి రావడంపై తనకు మూడు ప్రణాళికలున్నాయని రజినీకాంత్ చెప్పారట.. యువరక్తాన్ని పార్టీలో నింపడం.. పార్టీలో ఒకే వ్యక్తి పెత్తనం లేకుండా చేయడం.. పార్టీ అధికారంలోకి వస్తే పార్టీ అధినేతగా మాత్రమే కొనసాగుతానని.. ముఖ్యమంత్రి గా మరో అభ్యర్థి ఉంటారని.. సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం అవ్వాలన్న ఆశలేదని రజినీ కుండబద్దలు కొట్టారు. ప్రభుత్వంలో పార్టీ అధ్యక్షుడి ప్రమేయం ఉండదన్నారు.
జయలలిత మరణం తర్వాత తమిళనాట రాజకీయ శూన్యత ఏర్పడిందని.. తనకూ మూడు ప్రణాళికలున్నాయని రజినీ తెలిపారు.రాజకీయ నాయకులకు ప్రజలు అంటే ప్రయోజనాలు సంక్షేమం కాదని స్పష్టం చేశారు.