Begin typing your search above and press return to search.

నేను లోకల్‌, గెలిచి చూపిస్తా – పీవీపీ

By:  Tupaki Desk   |   18 March 2019 12:16 PM GMT
నేను లోకల్‌, గెలిచి చూపిస్తా – పీవీపీ
X
వైసీపీ నుంచి విజయవాడ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు పీవీపీ. పీవీపీ అసలు పేరు పొట్లూరి వర ప్రసాద్‌. ఆయన రాజకీయాలంటే ఆసక్తి ఉంది. 2014 ఎన్నికల్లో విజయవాడ నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. అందుకోసం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మద్దతు కూడా తీసుకున్నారు. అయితే.. అప్పటికే ఆ సీటుని ఏపీసీఎం చంద్రబాబు కేశినాని నానికి ఇచ్చేశారు. దీంతో.. ఒక్కవిజయవాడ తప్ప ఇంక ఏది అడిగినా తాను ఇస్తానని చెప్పారు చంద్రబాబు. పవన్‌ కూడా గట్టిగ అడగలేకపోయారు. దీంతో విజయవాడ నుంచి పోటీ చేసే అవకాశాన్ని తృటిలో మిస్సయ్యాడు పీవీపీ

అయితే ఈసారి పీవీపీ గురి తప్పలేదు. షెడ్యూల్‌ కు పది రోజుల ముందు వచ్చి వైసీపీలో చేరారు. టిక్కెట్‌ కన్‌ ఫర్మ్ చేయించుకున్నారు. విజయవాడ పీవీపీకి లోకల్‌. అందులోనూ ఎన్నికల ఖర్చులో పీవీపీ వెనక్కు తగ్గే వ్యక్తి కాదు. అన్నింటికి మించి కమ్మ కులానికి చెందిన వ్యక్తి. కేశినాని లాంటి వ్యక్తిని ఢీకొట్టాలంటే పీవీపీయే సరైన అభ్యర్థి అని జగన్‌ భావించి.. విజయవాడ సీటుని పీవీపీకే ఇచ్చాశారు. సీట్‌ కన్‌ ఫర్మ్ కావడంతో.. పీవీపీ విజయవాడలో వాలిపోయారు. తన ప్రచారాన్ని మొదలుపెట్టేశారు. సోమవారం ప్రెస్‌ మీట్ ఏర్పాటు చేసిన పీవీపీ తాను లోకల్‌ అని.. తనకు విజయవాడలో ఉన్న అని సమస్యలు తెలుసని చెప్పారు.

వైఎస్‌ హాయాంలో స్వర్ణాంధ్రప్రదేశ్ చూశామని.. మళ్లీ అటువంటి పాలన వైఎస్‌ జగన్‌తో సాధ్యమని చెప్పారు. రాజధాని ప్రాంతంగా విజయవాడను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రగతి వైపు పరుగు అనే నినాదంతో ముందుకు సాగుతామని.. కేశినేని నానిపై విమర్శలు చేసి తన టైమ్ వేస్ట్‌ చేసుకోనని అన్నారు ఆయన. మొత్తానికి పీవీపీ దూకుడు చూస్తుంటే.. కేశినేని నానికి గట్టి పోటీ ఇచ్చేట్లే కన్పిస్తున్నాడు.