Begin typing your search above and press return to search.
21 నిమిషాల్లో సర్జికల్ స్ట్రైక్స్ 2 పూర్తి!
By: Tupaki Desk | 26 Feb 2019 9:34 AM GMTఉగ్రవాద కార్యకలాపాలపై భారత ప్రభుత్వం సీరియస్ యాక్షన్ స్టార్ట్ చేసింది. పుల్వామా ఉగ్రదాడికి బదులు తీర్చుకుంటూ మెరుపుదాడుల్ని నిర్వహించిన వైనం తెలిసిందే. దాయాదికి దిమ్మ తిరిగిపోయేలా ప్లాన్ చేసిన మెరుపు దాడులతో పాక్ దిక్కుతోచని పరిస్థితి. భారత్ ఈ స్థాయిలో రియాక్ట్ అవుతుందన్న అంచనా లేకపోవటంతో.. మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. మరోవైపు భారత సర్కారు చేసిన మెరుపు దాడులపై దేశ వ్యాప్తంగా సానుకూలత వ్యక్తమవుతోంది.
పాక్ దుర్మార్గానికి బదులు తీర్చుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో భారత వైమానిక దళం చేపట్టిన మెరుపుదాడులకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే.. మెరుపుదాడులకు సంబంధించి ఒక ఆసక్తికర అంశం బయటకు వచ్చింది.
భారత్ నిర్వహించిన మెరుపుదాడులు కేవలం 21 నిమిషాల్లోనే పూర్తి చేశారు. పాక్ ఆర్మీ తేరుకునేలోపే దాడుల్ని పూర్తి చేసిన వైమానిక దళాలు వెనక్కి వచ్చేశాయి. ఏం జరిగిందో అర్థం చేసుకొని.. జరిగిన నష్టాన్ని లెక్క వేయాలన్న ఆలోచన వచ్చే లోపే దాడులు పూర్తి కావటంతో పాక్ కుతకుతలాడిపోతోంది.
పక్కా ప్లానింగ్ తో జరిగిన దాడులతో జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలు నామరూపాల్లేకుండా ధ్వంసమయ్యాయి. భారత వైమానిక దళానికి చెందిన మిరాజ్ 2000 జెట్ ఫైటర్లు ఉగ్రవాద శిబిరాలపై బాంబుల వర్షం కురిపించారు.ఒక సమాచారం ప్రకారం 22 మిరాజ్ యుద్ధ విమానాల్ని ఈ దాడుల కోసం వినియోగించారు.
తొలి దాడి మంగళవారం తెల్లవారుజామున 3.45 గంటలకు బాలా కోట్ లో జరగ్గా..రెండో దాడి 3.48 గంటలకు ముజఫరాబాద్ లో చోటు చేసుకుంది. ఇది జరిగిన మరోపది నిమిషాలవ్యవధిలో మూడోదాడి చకౌటిలో 3.58 గంటలకు చోటు చేసుకుంది. మొత్తం మూడు దఫాలుగా సాగిన ఈ దాడుల ప్రక్రియ మొత్తం 21 నిమిషాల్లో ఉగ్రవాద శిబిరాల్ని నేలమట్టం చేసి..సురక్షితంగా వైమానిక దళాలు గమ్యస్థానాలకు చేరుకున్నారు.
--